ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో గ్రామాలకు బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక గ్రామాలపై దృష్టి సారించనున్నారు. జనవరి 3 నుంచి పదిరోజుల పాటు జరిగే జన్మభూమి కార్యక్రమాలు దీనికి వేదిక కానున్నాయి. మొత్తం పది రోజుల్లో పది జిల్లాలు పర్యటించే చంద్రబాబు, రోజుకో గ్రామానికి వెళ్లనున్నారు. అంతకంటే ముందుగానే ప్రతి గ్రామానికీ ఒక యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా గ్రామానికి అవసరమైన నిధులు, సమస్యలను అందులో చేరుస్తారు. వాటిలో స్థానికులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. జన్మభూమి ప్రారంభం లోగా నోడల్ అధికారులను నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, జన్మభూమి కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరేందుకు వీలుగా వారిని ఆకట్టుకునేలా, రెండు పాటలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో జన్మభూమి కార్యక్రమం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంఓ కార్యదర్శి సాయిప్రసాద్, గిరిజాశంకర్, రాజవౌళి, సమాచారశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా పదిరోజుల పది అంశాలపై ప్రతిరోజూ జన్మభూమి సభల్లో చర్చించనున్నారు. ఆరోగ్యం, విజన్, పరిశ్రమలు, వ్యవసాయం, సంతోషం వంటి పది అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ‘జన్మభూమి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏ స్థాయిలో వారికి చేరుతున్నాయో చెప్పడమే కాకుండా, ప్రభుత్వం వారి కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు వివిధ అంశాలపై వారిలో చైతన్యం తీసుకురావడమే జన్మభూమి లక్ష్యమని డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు.
ప్రచారంపై సమాచార శాఖ కమిషనర్ సమీక్ష
కాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సమాచారశాఖ సిద్ధమవుతోంది. కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం సమాచారశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన, వివిధ శాఖలతో సమన్వయం, కరపత్రాలు, నినాదాలు, డిజైన్లు, క్షేత్రస్థాయి ప్రచారంపై సమావేశంలో చర్చించారు.