ఆంధ్రప్రదేశ్‌

నేడు సీపీఐ పోలవరం బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ స్థితిగతులను స్వయంగా తెలుసుకునేందుకు సీపీఐ ప్రతినిధి బృందం శనివారం ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర నిధులతో పూర్తిచేస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిర్మాణం విషయంలో ఇంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఎవరనే విషయమై సీపీఐ బృందం అధ్యయనం చేయనుంది. కేంద్ర నిధుల విడుదలలో జాప్యం వల్ల పోలవరం ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరగడమే కాక, నిర్మాణ కాలం కూడా పెరుగుతూ వస్తోందని పార్టీ అభిప్రాయపడుతోంది. దీనికితోడు ప్రస్తుతం పోలవరంపై పలు రకాల వివాదాలు చోటుచేసుకోవడం వలన ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని నిర్వాసితుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని అన్నారు.