ఆంధ్రప్రదేశ్‌

జడ్‌పిలో ఉద్యోగాల పేరిట మోసం ..11 మంది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 15: ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ జడ్పీ వెబ్‌సైట్ ప్రారంభించి పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన 11 మంది వ్యక్తులను శుక్రవారం నాడు మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 31లక్షల 75వేల రూపాయల నగదు , నకిలీ రబ్బరు స్టాంపులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి జిల్లా పరిషత్ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ఉద్యోగ ఉత్తర్వులు అంటూ పలువురు నిరుద్యోగులను మోసంచేసినట్లు ఎస్‌పి తెలిపారు.
దీంతో జిల్లా పరిషత్ సి ఇ ఓ , బాధితులు ఇచ్చిన పిర్యాధు మేరకు షేఖ్ ఖాశీం అనే వ్యక్తితోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఈనెల 3న జిల్లాపరిషత్ సిఇఒ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సిఇఒ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్‌సైట్ తయారుచేసిన రిపోర్టుపై అర్ధవీడు పోలీసుస్టేషన్‌లో కేసునమోదు చేశామన్నారు. ఈకేసులో మార్కాపురం సిఐ భీమానాయక్ 69మంది బాధితులను ఇప్పటివరకు విచారించినట్లు తెలిపారు. అనంతరం 11మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టుచేసినట్లు పేర్కొన్నారు. అర్ధవీడు మండలం పాపినేనిపల్లికి చెందిన షేక్ ఖాసీంవలీ అలియస్ లెజండ్ ఖాసీం అనే ప్రధాన నిందితుడితోపాటు అదేగ్రామానికి చెందిన దూదేకుల ఖాసీంసాహెబ్,షేక్ ఖాసీంపీరా, బేస్తవారిపేటకు చెందిన షేక్ ఖాసీం, కంభం మండలానికి లకొండు చిన సుబ్బారావు, గంగిశెట్టి సంతోష్, గుంటూరు జిల్లా మంగళిగిరిలోని కొప్పరావూరి కాలనీకి చెందిన చింతక్రింది రాంబాబు, డ్యూలి కాంప్లెక్స్‌కు చెందిన షేక్ సాధిక్, ఒంగోలు గోపాలనగర్‌కు చెందిన మిరియాల ఉదయ్, ఒంగోలులోని భరత్ నగర్‌కు చెందిన షేక్ మాబు, ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఇక్బాల్ భాషలను పోలీసులు అరెస్టుచేశారన్నారు. మొత్తం 31లక్షల 75వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. లెజండ్ ఖాసీం వద్దనుండి 21లక్షా 75వేల రూపాయలు, ట్రాక్టర్ ఖాసీం వద్దనుండి 10లక్షల రూపాయల నగదు మొత్తం కలిపి 31లక్షల 75వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా ఖాసీం వద్దనుండి ఒకలక్షా 50వేల రూపాయల విలువచేసే రెండు ప్రాంసరీ నోట్లు , డాక్యుమెంట్‌ను లెజండ్ ఖాసీం ఇంటినుండి ఒక విఐపి సూట్‌కేసులోని కొన్ని రబ్బరు స్టాంపులు, ఖాళీ రికమండేషన్ సర్ట్ఫికేట్లు, కొన్ని నకిలీ సంతకాలుపెట్టిన లెటర్లు, ఆధార్‌నెంబర్లు, 35మంది రెండునెలల జీతం (పదివేల రెండువందల రూపాయలు) చెల్లించినట్లుగా ఉన్న పత్రాలు ఒక సిపియు, ఒకప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.