ఆంధ్రప్రదేశ్‌

డీజీపీపై కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: ఏపీ డీజీపీ నియామకం విషయంలో కేంద్రంతో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం జరుగనున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న డీజీపీ నండూరి సాంబశివరావు ఈనెల 31వ తేదీతో పదవీ విరమణ పొందనున్నారు. జేవీ రాముడు రిటైర్డ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడాదికి పైగా ఇన్‌ఛార్జిగా కొనసాగుతూ వచ్చిన నండూరి పదవి పొడిగింపుపై కొద్దిరోజుల క్రితం తెర మీదకు వచ్చిన అన్ని వాదనల నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందు డీజీపీ వ్యవహారంలో కేంద్రంతో రాష్ట్రం అమీతుమీ చందాన వ్యవహరించింది. డీజీపీగా నండూరినే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే రెండు సార్లూ కేంద్రం తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకుని కేంద్రంతో విభేదించి సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా నియమించుకుంది. కాగా ఈయన ఈనెల 31వతో రిటైర్ కానున్నందున డీజీపీ నియామకంపై అత్యవసరంగా చర్చించడం అనివార్యమైంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం జరిగే ఏపి కేబినెట్ భేటీలో ప్రధానంగా డీజీపీ నియామకం, అసెంబ్లీ డిజైన్స్ అంశాలు చర్చకు రానున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ పోలీసు యాక్టులో సవరణ జరిగింది. యూపీఎస్సీ కమిటీ ద్వారానే డీజీపీ ఎంపిక జరగాలనే విధంగా సవరణ చేశారు. అయితే డీజీపీ నియామకంలో తాజాగా ఏపీ ప్రభుత్వం సిఫార్సుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో పరిస్ధితి ఇబ్బందిగా మారింది. దీంతో డీజీపీ నియామాకానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ రాష్ట్రానికే అన్నట్లు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, బీహార్, మహారాష్టల్ల్రో అనుసరిస్తున్న విధానానే్న ఇక్కడా అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈక్రమంలో 2014 ఏపీ పోలీసు యాక్టు తీసుకువచ్చిన చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, తద్వారా ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా డీజీపీగా రాష్టమ్రే తమకు కావాల్సిన వ్యక్తిని నియమించుకుంటుందా.. లేదా ఇప్పుడున్న వారి పదవీ కాలం పొడిగిస్తుందా అనేది చూడాలి. ఒకవేళ కొత్తవారు తెర మీదకు వస్తే.. రేసులో ఉన్న మాలకొండయ్య, గౌతమ్ సవాంగ్, ఆర్‌పి ఠాకూర్‌లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీదట డీజీపీ నియామకానికి సంబంధించి శనివారం కేబినెట్‌లో చర్చించిన మీదట కీలక నిర్ణయం తీసుకుని ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.