ఆంధ్రప్రదేశ్‌

చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 15: గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలను గురువారం గ్రామస్తులు, కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్న నేపధ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడి భారీ అంచనాలతో ఆధునిక పరికరాలతో కోటలో శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ కోటలో బంగారు ఆభరణాలు, వజ్ర, వైఢూర్యాలు దాచి ఉంచారన్న ప్రచారం గత కొనే్నళ్లుగా జరుగుతోంది. అంతులేని ఈ సంపదను వెలికితీస్తే కళ్లుచెదిరే నిధులు బయటపడతాయని కొందరు చారిత్రక ఆధారాలతో సహా నెల రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యంలో నాటి చెన్నపట్నంగా పిలువబడే నేటి చెన్నంపల్లిని రాజధానిగా చేసుకుని చెన్నమనాయుడు అనే సామంతరాజు పరిపాలన కొనసాగించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 1800 సంవత్సరంలో చెన్నమనాయుడు ఈ కోటను నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన పాలించిన రోజుల్లో లభించిన సంపదను కోటలో పలు ప్రాంతాల్లో దాచి వుంచినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నివేదికను అందులో పొందిపరిచిన ఆధారాలను పరిశోధకుల వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. పరిశోధకుల అంచనాలు నిజమే అయితే తాము జరిపే తవ్వకాల్లో వెలుగులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. పోలీసు భద్రత నడుమ ఆదోని ఆర్డీఓ ఓబులేసు తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. కాగా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గుప్తనిధుల కోసం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం గుప్తనిధులు వెలుగులోకి వస్తే వాటిని ప్రజాప్రయోజనాలకు వినియోగించడంలో తప్పులేదని స్పష్టం చేస్తున్నారు. గుప్తనిధుల తవ్వకాల్లో లభ్యమయ్యే నిధుల్లో అధిక భాగం తమ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న రెవెన్యూ అధికారులు