ఆంధ్రప్రదేశ్‌

నకిలీ ఐపీఎస్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, డిసెంబర్ 15: ఐపిఎస్‌ను అంటూ నకిలీ గుర్తింపు కార్డులతో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో చెలామణి అవుతున్న యువకుడిని గిద్దలూరు సిఐ శ్రీరాం, ఎస్సై మల్లికార్జున్ అరెస్టు చేశారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో నకిలీ ఐపిఎస్‌ను చూపించారు. ఈసందర్భంగా సిఐ శ్రీరాం మాట్లాడుతూ కడపజిల్లా కాశీనాయన మండలం వడ్డేమానుపల్లె గ్రామానికి చెందిన కర్ణాటి వినోద్‌రెడ్డి అనే యువకుడు గిద్దలూరులోని శ్రీవివేకానంద ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. వినోద్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి డిఫెన్స్ పోలీసు ఆఫీసర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. డిగ్రీ అనంతరం హైదరాబాద్, ఢిల్లీలలో ఐపిఎస్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇతనితోపాటు కోచింగ్ పొందిన మిగత యువకులు ఐపిఎస్‌లో సెలక్ట్ కాగా వినోద్‌రెడ్డి మాత్రం సెలక్ట్ కాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. దానితో కోరిక విఫలం కావడంతో అది కాస్త పక్కదారి పట్టింది. ఐపిఎస్ అని ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయడం కానీ, ఇంకోవిధంగా మోసం చేయడం అనేది చేయకపోయినా అందరితో ఐపిఎస్ అనిపించుకోవాలనే కోరిక వినోద్‌రెడ్డికి మెండుగా కలిగింది. దానితో నకిలీ యూనియన్ పబ్లిక్‌సర్వీస్ ఐడికార్డు, వాయుసేనకు సంబంధించిన పైలెట్ ఐడికార్డును, యూనియన్ సర్వీసులో ఐపిఎస్ సెలక్ట్ అయిన అపాయింట్‌మెంటు లెటర్, క్యాన్వాస్ అనే స్టాంప్ తయారుచేసుకొని ప్రజల్లో తిరగసాగాడు. అయితే ప్రజలందరితో గౌరవం పొందాలనే అతని ఆశ పోలీసులకు దొరికిపోయేవిధంగా చేసింది. గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు సైతం వినోద్‌కుమార్‌రెడ్డి నకిలీ ఐపిఎస్‌గా వచ్చి తాను ఐపిఎస్‌ను అని హడావుడి చేయగా ఎస్సై మల్లికార్జున్‌కు అనుమానం వచ్చింది. దీనిపై ఎస్సై సమగ్ర విచారణ చేపట్టి వినోద్‌కుమార్‌రెడ్డి నకిలీ అని నిర్దారణ చేసుకున్నాడు. దానితో యూనియన్ పబ్లిక్‌సర్వీసును ఫోర్జరీ చేసినందుకు వినోద్‌కుమార్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు.