ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక నేరాలు, సామాజిక రుగ్మతలపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 15: సమాజంలో ఆర్థిక నేరాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ సైకిల్ ర్యాలీని నిర్వహించడానికి రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపిఎస్‌పిఎఫ్) సన్నాహాలు చేస్తోందని ఏపిఎస్పీఎఫ్ విశాఖపట్నం యూనిట్ ఇన్‌ఛార్జి, డీఎస్పీ జి.లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులను ఆయన కలిసి తమ ప్రణాళికలను వివరించారు. సైకిల్ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని ఉన్నతాధికారులను కోరారు. ఏపీఎస్పీఎఫ్ డైరక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాల మేరకు రాష్టస్థ్రాయి సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నామన్నారు. సైకిల్ ర్యాలీకి ప్రారంభ వేదికగా శ్రీకాకుళాన్ని నిర్ణయించడం ఆనందంగా ఉందని అన్నారు. ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 27న కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. 27న ఉదయం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఇందులో డైక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్, కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్ శోభ, జెసీ చక్రధర్‌బాబు, ఎస్పీ సిఎం త్రివిక్రమవర్బ పాల్గొంటారన్నారు. ఏపిఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్యాసంస్థల ప్రధానాచార్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొంటారన్నారు.