ఆంధ్రప్రదేశ్‌

అడ్రసులేనిఈ- రిక్షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: పర్యావరణ హిత ప్రజా రవాణను మెరుగు పరచాలన్న లక్ష్యంతో అందుబాటులోకి తీసుకురావాలని భావించిన ఈ- రిక్షా, ఈ-కార్ట్‌లు నేడు ఎక్కడా కన్పించని పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే జీఓ విడుదల చేసినప్పటికీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో పర్యావరణ హిత రవాణా వాహనాలు రోడ్డెక్కలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో స్మార్ట్‌సిటీల రూపకల్పనకు అంకురార్పణ జరిగిన నేపథ్యంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఈ-రిక్షా, ఈ-కార్ట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకోవడమే తడవు రవాణాశాఖ అప్పటి కమిషనర్ సుమిత దావ్రా 2017 మార్చిలో జీఓ 3 జారీ చేశారు. జీవో అయితే జారీ చేసిన అధికారులు పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో వాహనాల రిజిస్ట్రేషన్, అందుకు సంబంధించి ఫీజుల వసూలు వంటి అంశాలను పేర్కొనలేదు. దీంతో గత తొమ్మిది నెలలుగా పర్యావరణ హిత వాహనాల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమే కాలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ-కార్ట్, ఈ-రిక్షాలు రయ్య్ మంటూ దూసుకెళుతుంటే, నవ్యాంధ్రలో మాత్రం వీటికి రోడ్డెక్కే అవకాశం చిక్కలేదు. విచిత్రమేమిటంటే పర్యావరణ హిత వాహనాల విషయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గతంలోనే పలు వాహన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అనంతపురం లేదా విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేసి వాహనాల ఉత్పత్తి చేపట్టేందు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ కీలక నిర్ణయాలే తీసుకున్నారు. వాహనాల కనీస వేగం 25కిమీకి మించకూడదని, నిర్ధారించిన ప్రాంతం 20కిమీ దాటి వాహనాలు నడపరాదని జీఓలో పేర్కొన్నారు. అలాగే ఎటువంటి రహదార్లు వాహనాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయో కూడా స్పష్టం చేశారు. అయితే ఇది జరిగి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఈ-కార్ట్, ఈ-రిక్షా వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో ఎక్కడా వాహనాలు రిజిస్ట్రేషన్‌కు నోచుకోలేదు. దీనిపై కొంతమంది రవాణా శాఖను సంప్రదించగా వాహనాల రిజిస్ట్రేషన్‌కు రూ.500 ఫీజుగా నిర్ధారించారు. సమస్య పరిష్కారమైందని భావిస్తున్న తరుణంలో రవాణాశాఖ కొత్త అంశాన్ని లేవనెత్తింది. రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయిస్తే సరిపోదని, లైఫ్ టాక్స్ తదితర అంశాలను ప్రస్తావించలేదంటూ కొర్రీ వేసింది. కొన్ని తర్జన భర్జనల అనంతరం పర్యావరణ హితమైన వాహనాలు కాబట్టి మొదటి రెండు సంవత్సరాలు టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. తరువాత ప్రతి సంవత్సరం రూ.2,500 టాక్స్ చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా రవాణాశాఖ కమిషనర్ చొరవ చూపడం వల్లే సాధ్యమైంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఉత్తర్వులు సచివాలయం నుంచి రవాణా శాఖకు అందకపోవడంతో ఈ పర్యావరణ హిత వాహనాలు రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది.