ఆంధ్రప్రదేశ్‌

ఇక రాష్ట్ర పరిధిలోకి డీజీపీ నియామకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: డీజీపీ నియామకాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా పోలీస్ యాక్టు-2014కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీచేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. శాసనసభ నిర్మాణానికి సంబంధించి టవర్ ఆకృతి (స్పైక్ మోడల్)కు మొగ్గుచూపింది. ఈనెల 27న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌చే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 9 అర్బన్ మండలాలు ఏర్పాటు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం శనివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.
* ప్రస్తుతం డీజీపీ నియామకంలో అమల్లో ఉన్న చట్టాన్ని సవరించనున్నారు. త్వరలో సమగ్ర పోలీస్ చట్టాన్ని కూడా రూపొందించనుంది. ఏఐఎస్ యాక్ట్-1953కి లోబడి డీజీపీ పదవీ కాలం నిర్ణయించనున్నారు.
* రాష్ట్ర శాసనసభ నిర్మాణం కోసం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన స్పైక్ మోడల్‌పై మంత్రివర్గం మొగ్గుచూపింది.
* ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఈనెల 27న రాష్టప్రతిచే ప్రారంభించనున్నారు. రెండు లక్షల మందితో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్టప్రతి పాల్గొంటారు. అదేరోజు సచివాలయాన్ని కూడా సందర్శిస్తారు.
* చంద్రన్న పెళ్లి కానుకను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద బీసీలకు 30వేలు, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు 50వేల రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
* పప్పు్ధన్యాల కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.. ఆర్ధిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు ఈ కమిటీలో ఉంటారు.
* ట్రాన్స్‌జెండర్ పాలసీపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నిర్ణయం. 20వేల మంది హిజ్రాలకు మేలు కలిగే విధంగా పాలసీనీ చేసేందుకు నిర్ణయం. 18సం.లు పైబడిన హిజ్రాలకు రూ.1500 పింఛన్ అందజేత. చిన్నతరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా బ్యాంక్ రుణాలు అందిస్తారు.
* రాష్ట్రంలో 9 అర్బన్ మండలాలు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. విశాఖ అర్బన్-2,3,4, విజయవాడ అర్బన్-2,3,4, గుంటూరు అర్బన్ మండలం, నెల్లూరు అర్బన్ మండలం, కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటు కానున్నాయి. విశాఖ, కృష్ణాజిల్లాల్లోని రూరల్ మండలాలను పునర్ వ్యవస్థీకరిస్తారు.
* కృష్ణాజిల్లా గన్నవరంలో కొత్తగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటిన్ కం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు. ఇందుకవసరమైన 27 పోస్టులు మంజూరు.
* కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 75 ఎకరాల భూమిని అశోక్ లేల్యాండ్‌కు కేటాయించనున్నారు.
అదే గ్రామంలో 81 ఎకరాల భూమిని మోహన్ స్పిన్‌టెక్స్‌కు కేటాయించేందుకు నిర్ణయం.
* నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈవూరు బిట్-1ఎ వద్ద లాజిస్టిక్ పార్క్‌కు అప్రోచ్ రోడ్డు నిమిత్తం 3.9 ఎకరాల కేటాయింపు. * కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలో 381 ఎకరాల భూమిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం నోటిఫై చేసేందుకు వీలుగా అటవీశాఖకు అప్పగించేందుకు కలెక్టర్‌కు అధికారం ఇస్తూ నిర్ణయం.
* పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ పనుల కోసం మొబలైజేషన్ అడ్వాన్స్ కింద నిర్మాణ సంస్థకు ప్రభుత్వం చెల్లించిన 404 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకునందుకు నిర్ణయం.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం