ఆంధ్రప్రదేశ్‌

20 నుంచి క్రిస్మస్ కానుకల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: రాష్ట్రంలో చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా ఈనెల 20 నుంచి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేస్తామన్నారు. త్వరలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. బయోమెట్రిక్, ఐరీస్ పనిచేయని వారి కోసం 5రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రేషన్ సరుకులు నేరుగా వారి ఇంటికే వెళ్లి పంపిణీ చేస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరూ పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పండుగనాడు పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలతో ఆరు రకాల నిత్యావసర సరుకులను మూడేళ్ల నుంచి ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ఉన్న కోటీ 43లక్షల 30వేల కార్డుదారులకు చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఈనెల 20తేదీ నుంచి 26 తేదీ వరకూ చంద్రన్న క్రిస్మస్ కానుకలను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రన్న సంక్రాంతి కానుకలను వచ్చేనెల 1వ తేదీ నుంచి ఇతర రేషన్ సరుకులతో కలిపి అందజేయనున్నామన్నారు. చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా చంద్రన్న కానుకల పేరుతో ఆరు రకాల వస్తువులతో పాటు రూ.13 విలువ కలిగిన క్యారీబ్యాగ్ కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రూ.226ల విలువ కలిగిన కేజీ గోధుమ పిండి, కందిపప్పు, బెల్లం, శనగపప్పు అరకేజీ చొప్పున, అర లీటర్ పామాయిల్, వంద గ్రాముల నెయ్యి చంద్రన్న కానుకగా అందజేస్తున్నామన్నారు. చంద్రన్న కానుకల పంపిణీలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు సరుకుల నాణ్యతపై రాజీపడొద్దని ఇప్పటికే సీఎం ఆదేశించారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, నాణ్యమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారో.. లేదో పరిశీలించాలని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారన్నారు. ఎక్కడైనా నాణ్యతలేని సరుకులను పంపిణీ చేస్తే, తక్షణమే 1100కు ఫోన్ చెయ్యాలని కార్డుదారులకు మంత్రి తెలిపారు. నాణ్యతలేని సరుకులను పంపిణీ చేస్తే, వాటిని తీసుకుని మంచి సరుకులను తిరిగిస్తామన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పేదలకు రూ.360 కోట్లతో క్యారీ బ్యాగ్‌తో కలిసి ఏడు రకాల వస్తువులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వారికి కూడా చంద్రన్న కానుకలు అందజేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.