ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో ఆక్వా క్లస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగం అభివృద్ధికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఆక్వా సాగుచేసే తొమ్మిది జిల్లాల్లో 121 క్లస్టర్లుగా విభజించామన్నారు. ప్రతీ క్లస్టర్‌కు 1000 నుంచి 1500 హెక్టార్లు ఉంటాయని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యాంటిబయోటిక్స్ వినియోగం నిషిద్ధమన్నారు. ఎగుమతిదారులు, రైతులు, టెక్నీషీయన్స్ తదితర ఆక్వా రంగానికి సంబంధించిన వారితో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమాశంకర్ నాయక్ మాట్లాడుతూ ఇక నుంచి పక్షం రోజులకు ఒక సారి ఎంపెడా, ఎలీసా, మత్య్సశాఖలు ఆక్వా చెరువులను తనిఖీ చేస్తున్నట్టు వివరించారు. అంతేకాకుండా ప్రతీ చెరువుకు ఈటీపీ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని, తోడుకున్న నీరు విడుదల చేస్తున్న సమయంలో పక్క రైతులు కూడా వాటిని చెరువులకు తోడుకోవడం వల్ల ఆక్వా ఉత్పత్తుల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు కనిపిస్తున్నాయని కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా 85 వేల హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుందని, అందులో 85వేల హెక్టార్లులో రొయ్యల సాగు చేస్తున్నారని కమిషనర్ చెప్పారు. దేశం నుంచి ఎగుమతి చేస్తున్న రొయ్యల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు అవుతున్నాయని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ఆంధ్రా రొయ్యకు కష్టాలు ఎదురవుతున్నందున ఆక్వా రైతులు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఫాం, ఫీడ్, హ్యాచరీ, ల్యాబ్ , ప్రోసెసింగ్ ప్లాంట్లకు ఎవరికి వారు గ్రూపులను ఏర్పాటుచేసుకోవాలన్నారు. రాష్ట్రీయ వికాస్ యోజన ద్వారా ఆక్వా రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ రమాశంకర్ నాయక్ చెప్పారు. ఆక్వా చెరువులకు ఏరియేటర్లతోపాటు పాండ్ డివైసెస్, సీసీ కెమేరాలు మత్య్సశాఖ అందిస్తుందన్నారు. ఎంపెడా ఎగుమతి తనిఖీల అధికారి పిఎ షర్బీ, డిడి డాక్టర్ ఫణి ప్రకాష్, డాక్టర్ పి రామ్మోహన్‌రావు, ఎంపెడా అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.