ఆంధ్రప్రదేశ్‌

డీజీపీ నియామకంపైనే మంత్రిమండలిలో ప్రధానంగా చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: రాష్ట్ర డీజీపీ నియామక అధికారం మన పరిధిలోనే ఉండాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రిమండలి భేటీలో డీజీపీ నియామకం అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కర్నాటక, తెలంగాణలో డీజీపీలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకునేందుకు వీలు కల్పించిన కేంద్ర ం ఏపీకి మాత్రం ఇవ్వకపోవడాన్ని కొంతమంది మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. శాంతి భద్రతలకు సంబంధించిన అంశంపై నిర్ణయాధికారం రాష్ట్రానికి లేకుండా చేయడంపై కొంతమంది అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీజీపీగా నండూరు సాంబశివరావును నియమించేందుకు కేంద్రానికి రాష్ట్రం పంపిన లేఖను తిరస్కరించడం తెలిసిందే. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నండూరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని సీఎం చేస్తున్న ప్రయత్నాలు కేంద్ర వైఖరి కారణంగా కొలిక్కిరావడం లేదు. తన నియామకంపై చర్చ జరుగుతుండటంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న తనకు ఆ పదవి వద్దన్నట్లు భోగట్టా. మూడు నెలల పొడిగింపు కోసం ఇంత చర్చ జరగడం ఎందుకన్నట్లు తెలిసింది. అయినప్పటికీ, ఏఐఎస్ చట్టం -2014కు సవరణ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో డీజీపీ నియామకం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఈ మేరకు ఆర్డినెన్సు తీసుకువచ్చేందుకు నిర్ణయించడంతో నండూరిని పూర్తిస్థాయి డీజీపీగా నియమించేందుకు వీలు కలుగనుంది. అమరావతిలో నిర్మించనున్న పాలనానగర భవనాల ఆకృతులను రాష్టప్రతి, గవర్నర్, ఇతర ప్రముఖులకు చూపించేందుకు నిర్ణయించారు.