ఆంధ్రప్రదేశ్‌

క్షుణ్ణంగా పరిశీలించాకే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: విజయవాడ నగర శివార్లలోని మహ్మదీయ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు శనివారం మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. హజరత్ గాలీబ్ సాహెబ్ దర్గా భూములను మహ్మదీయ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ గతంలో వక్ఫ్‌బోర్డు నుంచి వేలంలో కొనుగోలు చేసింది. ప్లాట్ల కేటాయింపులపై ఫిర్యాదులు అందటంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉప సంఘం సమావేశమైంది. సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు, మైనార్టీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బైలాస్ మేరకు ప్లాట్లు పొందినవారిని ఇబ్బంది పెట్టకుండా, వాటిని క్రమబద్ధీకరించేలా మంత్రివర్గ ఆమోదానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పొందినవారిపై సహకారశాఖ ఏమి చర్యలు తీసుకున్నదో ఇప్పటివరకు తెలపకపోవడాన్ని మంత్రివర్గ ఉప సంఘం తప్పుపట్టింది. వారిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో వచ్చే సమావేశం నాటికి అందించాల్సిందిగా సహకార శాఖ అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పొందినవారి విషయంలో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.