ఆంధ్రప్రదేశ్‌

మరో మైలురాయని దాటిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/్ధర్మవరం, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం నాటికి 500 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది. ఇందుకు గుర్తుగా గొట్లూరుకు గ్రామంలో ఏర్పాటుచేసిన స్థూపాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడే మొక్క నాటారు. గత నెల 6వ తేదీ కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ జిల్లాలో 93.8 కి.మీ దూరం నడిచారు. అనంతరం కర్నూలు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. అక్కడే వంద, 200 కి.మీ మైలురాళ్లు దాటారు. కర్నూలు జిల్లాలో 263 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. అనంతరం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర 300, 400 కి.మీ దాటి శనివారం 500 కిలోమీటర్లకు చేరుకుంది. 36 రోజుల్లో 3 జిల్లాలను కలుపుకొంటూ సాగిన యాత్రలో దారిపోడవునా మొత్తం 3లక్షల 50వేల మంది ప్రజానీకాన్ని నేరుగా కలుసుకోగా, 21 ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్‌లు, 61 కమ్యూనిటీ ఇంటరారక్షన్స్, 42 స్లాట్ మీటింగ్‌లు, 9చోట్ల పార్టీ చేరికలు, 4 జిల్లాల వైకాపా ప్రతినిధులతో సమావేశాలు, 19 ప్రత్యేక కార్యక్రమాలు, 40 చోట్ల పార్టీ పతాకావిష్కరణలు, 122 వెల్‌కమ్ పాయింట్లు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా వివిధ కులాల, వర్గాల ప్రతినిధుల తోపాటు పలువురి చేతి వృత్తిదారులు, వ్యవసాయ రంగ ప్రతినిధులు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగ ప్రతినిధులు, పారిశ్రామిక కార్మికులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, వివిధ యూనియన్ల ప్రతినిధులు, తదితరులు జగన్‌ను కలుసుకున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత, గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం, రుణమాఫీ, బ్యాంకు రుణాల లభ్యత, దళారీల దోపిడీ తదితర అంశాలపై జనంతో జగన్ సమీక్షించారు. అలాగే కుల వృత్తులైన చేనేత, కుమ్మరి, చర్మకార, తదితర వృత్తిదారులను కలుసుకుని వారి వారి సమస్యలను వీక్షించారు.

చిత్రం..శనివారం మహిళలతో కలిసి నడుస్తున్న జగన్