ఆంధ్రప్రదేశ్‌

2019నాటికి బలమైన శక్తిగా బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే ఎన్నికల నాటికి బీజేపీని బలమైన శక్తిగా తయారుచేసేందుకు అధిష్ఠానం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పోలింగ్ బూత్‌ల వారీగా పటిష్టమైన కమిటీలను నియమించినట్టు తెలిపారు. కాకినాడలో శనివారం విలేఖరుల సమావేశంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు కృషి చేయాల్సిందిగా పార్టీ నేతలకు అధిష్ఠానం పిలుపునిచ్చిందన్నారు. గడచిన నాలుగేళ్ల పాలనలో ప్రధాని మోదీ మచ్చ లేని నాయకుడిగా సేవలందిస్తున్నారన్నారు. దేశంలో కొన్ని రాజకీయ శక్తులు రిజర్వేషన్ల వ్యవహారంలో బీజేపీని బదనాం చేసేందుకు కుట్ర పన్నారని, వారి చర్యలను ప్రధాని మోదీ తెలివిగా తిప్పికొట్టారని పేర్కొన్నారు. చట్టసభలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించేందుకు, సీట్లు అధికంగా కేటాయించేందుకు బీసీ కమీషన్‌కు చట్టబద్దత కల్పించేందుకు తీసుకువచ్చిన బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంతో ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి తప్ప వేరెవరికీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అర్హత లేదా? అని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. అదే తమ బీజేపీలోనైతే సమర్ధవంతులైన నాయకులకు అధ్యక్ష స్థానాన్నప్పగించి, వారసత్వ రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తున్నా లేకున్నా బీజేపీ కార్యకర్తలందరూ తమ పార్టీ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తారన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆహారం, డ్రగ్స్ తదితర వాటిలో కల్తీ అధికంగా జరుగుతోందని, దీనిపై పార్టీ నేతలు తనిఖీలు జరిపి, అక్రమాలపై పోరాడాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా, నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, మిత్రపక్షమైనప్పటికీ బీజేపీ ఆయా అంశాలపై రాజీ లేని పోరాటాన్ని సాగిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్ళు అర్హులైన వారికి అందేలా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు తనిఖీలు నిర్వహించాలని సురేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ నగర అధ్యక్షుడు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌రెడ్డి