ఆంధ్రప్రదేశ్‌

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య కాస్తంత తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో ఓవర్‌లోడ్‌తో నడిచే ఆటోలు రానురాను మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చట్టసభల్లో ప్రజాప్రతినిధులందరూ ఆటోల ఓవర్ లోడింగ్ గురించి మాట్లాడుతున్నప్పటికీ వాస్తవానికి వీరిలో అత్యధిక భాగం ఇటు రవాణా అటు పోలీస్ శాఖలపై ఆటోల విషయంలో చూసీచూడనట్టు పోవాలంటూ ఒత్తిడి తెస్తుండటం బహిరంగ రహస్యమే. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు రవాణా, పోలీస్ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక గణాంక వివరాల్లోకి వస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు మాసాల్లో 13 జిల్లాల్లో 19వేల 863 ప్రమాదాలు జరిగి 7వేల 169 మంది మరణిస్తే 25వేల 582 మంది గాయపడ్డారు. ఇందులో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 2వేల 441 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1877 ప్రమాదాలు జరిగిన గుంటూరు జిల్లాలో 784 మంది మరణించారు. ఆ సమయంలో గాయపడిన వారిలో అత్యధికంగా తూ.గో. జిల్లాలో 2వేల 290 మంది అయితే అత్యల్పంగా శ్రీకాకుళంలో 1376 మంది మాత్రమే. అలాగే ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదాలు కేవలం 871 మాత్రమే. ఈ ప్రమాదాల్లో అత్యల్పంగా 235 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యలో కృష్ణా తర్వాత తూ.గో, విశాఖ జిల్లాలు నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు విశే్లషిస్తే రాష్ట్రం మొత్తంలో 18వేల 812 రోడ్డు ప్రమాదాలు జరిగితే 6వేల 785 మంది మరణించగా, 23వేల 260 మంది గాయపడ్డారు. ఇందులో ప్రమాదాలు అత్యధికంగా కృష్ణాలో 2వేల 250, తూ.గో జిల్లాలో 2వేల 117, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 1913 ప్రమాదాలు జరిగాయి. మరణాలకు సంబంధించి అత్యధికంగా గుంటూరు జిల్లాలో 763 మంది, చిత్తూరు జిల్లాలో 754 మంది, తూ.గో జిల్లాలో 688 మంది మరణిస్తే అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 273 మంది మరణిస్తే ఇక గాయపడిన వారిలో అత్యధికంగా కృష్ణాలో 2672 మంది, తూ.గో.జిల్లాలో 2411 మంది, గుంటూరు జిల్లాలో 2190 మంది, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 1058 మంది గాయపడ్డారు. కేవలం గత ఏడాది అక్టోబర్ మాసానికి సంబంధించి గత ఏడాది అత్యధికంగా తూ.గో జిల్లాలో 238, కృష్ణాలో 218 మంది, విశాఖలో 198 ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది కృష్ణాలో 207, తూ.గో జిల్లాలో 194, గుంటూరులో 178 ప్రమాదాలు జరిగాయి. మరణాల సంఖ్యలో 2016 అక్టోబర్‌లో అత్యధికంగా తూ.గోలో 84, చిత్తూరు జిల్లాలో 79, గుంటూరు జిల్లాలో 73 మరణించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 76 మంది, తూ.గోలో 70 మంది, కడపలో 68 మంది మరణించారు. ఆర్టీసీ బస్సుల వల్ల ఐదు శాతం ప్రమాదాలు జరుగుతుండగా, ప్రైవేటు బస్సుల వల్ల 2 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక లారీల వల్ల 21 శాతం, ఆటోల వల్ల 10 శాతం, ద్విచక్ర వాహనాల వల్ల 28 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో కృష్ణాజిల్లా ఇటీవల ఇతర జిల్లాలకు స్ఫూర్తినిస్తోంది. ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఇటు రవాణా అటు పోలీస్ శాఖలు కొరడా ఝుళిపిస్తున్నాయి. సిఫార్సులను పక్కనబెట్టి కేసులు రాస్తున్నారు. కనీసం మూడు రోజులపాటు జైలుశిక్ష విధిస్తుండటంతో వాహన చోదకులు ఎంతగానో అప్రమత్తమవుతున్నారనేది అక్షర సత్యం.