రాష్ట్రీయం

తరలింపు కార్యాచరణ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: హైదరాబాద్ సచివాలయంలో శాఖల వారీ తరలింపు కార్యాచరణ శుక్రవారం మొదలైంది. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయో రికార్డు చేశారు. తర్వాత ఒక్కో శాఖ తమ రికార్డులతో సహా వెలగపూడికి మారుతుంది. అలాగే శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు నగరాల్లో గుర్తించిన భవనాల్లోకి తరలిస్తారు. ఈ ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని భావించినా, ఆగస్టు 31 వరకూ గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. స్కూళ్లలో తమ పిల్లలను చేర్చాలనుకునే వారు ముందుగా వెళ్లి అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసుకునేందుకు వీలుగా ఇప్పటికే సచివాలయ సిబ్బందికి, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి సెలవులు మంజూరు చేశారు. ప్రతిరోజు కొంతమంది చొప్పున విజయవాడ వెళ్లి అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు, విద్యాసదుపాయాలు, వైద్య సౌకర్యాలపై ఆరా తీసి వస్తున్నారు. మరికొంత మంది అక్కడే బస చేసేందుకు వీలుగా అద్దె ఇళ్లను తీసుకుంటున్నారు. సిఎస్ కార్యాలయం, సిఎం కార్యాలయం ఒకే మారు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి మార్చాలని నిర్ణయించారు. ఆ రెండు కార్యాలయాలు మారితే మిగిలిన కార్యాలయాలు అన్నీ అక్కడికి బదిలీ అవుతాయని భావిస్తున్నారు. పిల్లల భవిష్యత్‌పై తీవ్రమైన ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు చల్లటి కబురులా స్థానికతపై రాష్టప్రతి ఆమోద ముద్ర వేయడంతో ఆ అంశంపై చాలా స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న వారు వచ్చే ఏడాది కూడా తమ పిల్లలను విజయవాడకు తరలించి అక్కడి స్థానికతను క్లైయిమ్ చేసుకునే వీలుందని అంటున్నారు.
మరోపక్క తరలింపు వ్యవహారంలో ఒక్కో సంఘం తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెజిటెడ్ అధికార్ల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, కొంతమంది ఉద్యోగులు ఒక్కోమాదిరిగా స్పందించడంతో అయోమయం ఏర్పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడ రావాలంటే వౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అంతమాత్రాన రాజధానికి వెళ్లబోమని ఉద్యోగులు చెప్పడం లేదని ఎన్‌జిఓ నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. రావడానికి ఇష్టం లేని కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను అందరికీ ఆపాదించడం సమంజసం కాదని అన్నారు. వౌలిక వసతులు ఏర్పడ్డాక అక్కడికి వచ్చి పనిచేస్తామని తాము ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా చెప్పామని, అంతమాత్రాన ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టో పరిగణించరాదని అన్నారు. 2016 ఆగస్టు 31 నాటికి భవనాల సమీకరణ, గుర్తింపు, వెలగపూడిలో కొన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తవుతుంది కనుక అప్పటికి ఉద్యోగులంతా విజయవాడకు తరలివెళ్లాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.