ఆంధ్రప్రదేశ్‌

‘రబీ’ పంట రుణాలు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: రబీ సీజన్ పంట రుణాలు వెంటనే పంపిణీ చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన వెలగపూడి సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, విజయనగరం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలి, కౌలు రైతుల రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరాలని, ప్రకాశం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో సూక్ష్మ పోషకాల పంపిణీ మందకొడిగా ఉందన్నారు. జిల్లాల్లో ఎంపీఈవోల నియామకం వెంటనే భర్తీ చేయాలని, డిసెంబర్ 31 నుంచి జనవరి 9 వరకు గుంటూరులో జరిగే సుభాష్ పాలేకర్ శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. రైతు రుణ ఉపశమనానికి సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, మైక్రో ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి, లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లేబర్ కాంపోనెంట్ వినియోగంపై దృష్టి పెట్టాలని, పంట సంజీవని, వర్మి కంపోస్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. నరేగా మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. నరేగా పనులను పరిశీలించడానికి కేంద్ర బృందాలు కృష్ణా, గుంటూరులో పర్యటిస్తున్నాయని గుర్తుచేశారు. గతంలో మాదిరిగా కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే పరిస్థితి ఉండకూడదని, జిల్లాకు 2వేల ఎకరాల చొప్పున రాయలసీమ జిల్లాలు, ప్రకాశంలో 10వేల ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటివరకు అన్ని పథకాల కింద 1,95,927 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 2016-17కు సంబంధించి 14,772 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు.