ఆంధ్రప్రదేశ్‌

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: గ్రామ పంచాయతీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సమస్యలపై పంచాయితీ రాజ్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన చర్చలు కొంత మేరకు ఫలించటంతో సమ్మె వాయిదా పడింది. వేతనాల పెంపు, బకాయి జీతాలు, ప్రమోషన్లు, తదితర డిమాండ్లపై ఏపీ గ్రామ పంచాయితీ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన ఈ నెల 14న చలో కమిషనరేట్ కార్యక్రమం సందర్భంగా కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం జాయింట్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కమిషనర్‌తో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. గ్రామ పంచాయితీ కార్మికులకు క్షేత్రస్థాయిలో వివరాలను వారంలోపు సేకరించి జీతాలు పెంచుతామని, గ్రామ పంచాయితీ ఆదాయాల్లో జీతాలకు 30 శాతంలోపే ఖర్చు చేయాలనే నిబంధనను సవరించి 50 శాతానికి పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కమిషనర్ బి.రామాంజనేయులు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. జీతాల బకాయిలు వెంటనే చెల్లించేటట్లు, పీఎఫ్, ఈఎస్‌ఐ పథకాలు వర్తింపచేయడం వంటి సమస్యలను అన్ని జిల్లాల్లో సక్రమంగా త్వరితగతిన అమలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఇలాఉంటే చర్చలు సానుకూలంగా జరుగటంతో నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ కార్యదర్శుల ఖాళీ పోస్టుల భర్తీలో అర్హులైన గ్రామ పంచాయితీ కార్మికులకు 30 శాతం పోస్టులు కేటాయిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారన్నారు. గత నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ప్రకాశం జిల్లాలోని సమస్యను యూనియన్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. చర్చించి వెంటనే పరిష్కరిస్తామని కూడా ఆయన అన్నారు. టెండర్‌తో సంబంధం లేకుండా విధుల్లో కొనసాగించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దహన సంస్కారాలకిచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.5వేల నుండి రూ.10వేలకు పెంచుతూ ఆదేశాలిస్తామన్నారు. చర్చల్లో ప్రభుత్వం తరపున కమిషర్ బి.రామాంజనేయులు, అసిస్టెంట్ కమిషనర్ రంగా, బుచ్చిరాజు, యూనియన్ ప్రతినిధులు డి.వెంకట్రామయ్య, కె.ఉమామహేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, ఎన్.బీమేశ్వరరావు, జి.రామాంజనేయులు, జి.పుల్లారావు, కె.ప్రభుదాసు, వెంకటేశ్వరరావు, శంకర్, భూషణం, ఎం.నాగన్న, ఆర్.సుభాకర్, శివయ్య, కె.బుజ్జిబాబు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.