ఆంధ్రప్రదేశ్‌

సామాజిక సమస్యను రాజకీయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ఆమరణ దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడ పట్ల పోలీసు బలగాలు అనుసరించిన తీరు దుర్మార్గమైనదని, ముద్రగడ కుమారుడ్ని కూడా పోలీసులు దారుణంగా కొట్టారని, తుని ఘటనలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక సమస్యను రాజకీయం చేసి శాంతి భద్రతల అంశంగా సృష్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు. తుని ఘటన నుంచి తాజా సంఘటనలకు వరకు సిబిఐ విచారణ జరిపిస్తే దోషులెవరో బహిర్గతమవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని పోలీసులు సృష్టించారన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు. మాట తప్పిన చంద్రబాబు తన దుందుడుకుతనాన్ని మానుకోకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయన్నారు. ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో చేస్తున్న దీక్షలకు అంతమంది పోలీసులను ఎందుకు పంపారన్నారు. కొన్ని చానళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చానళ్ల ప్రసారాలను ఎప్పుడూ నిలిపివేయలేదన్నారు. గతంలో చంద్రబాబు పరిటాల రవీంద్ర హత్య సమయంలో, ఎన్టీఆర్ 1984లో పదవీచ్యుతుడైన సమయంలో బస్సులను కాల్చాలని, విధ్వంసం సృష్టించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు తన చేతుల్లో సిఐడి పోలీసులు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు అరాచకాలను సృష్టించడం సరికాదన్నారు. నిజాయితీ ఉంటే తుని ఘటనల వెనక ఎవరి హస్తం ఉందో బయటపడాలంటే సిబిఐ విచారణ జరిపించడమే శరణ్యమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, ఎన్నికల ముందు కాపులను బిసిల్లో చేరుస్తామని మాట ఇచ్చి, కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత చూస్తామని చెప్పడం చంద్రబాబు దివాళాకోరుతనం కాదా అని ప్రశ్నించారు. కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. ముద్రగడను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ సంఘటనలను ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు చూస్తూ ఊరుకోరాదని, నిరసనలు తెలియచేయాలని జగన్ కోరారు.

శుక్రవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్

ఏపి జ్యుడీషియల్
అకాడమీ డైరెక్టర్‌గా రఫీ
గుంటూరు (లీగల్), జూన్ 10: రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి డైరెక్టర్‌గా ఇప్పటివరకు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్‌ఎం రఫీ నియమితులయ్యారు. 2013 నవంబర్ 22వ తేదీన గుంటూరు జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుండి రఫీ పలు సంచలనాత్మక తీర్పులు వెలువరించారు. ఇటీవల ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 22 యేళ్ల జైలుశిక్ష విధించారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు పరిష్కరించి రెండుసార్లు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపారు. బార్-బెంచ్‌ల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సత్సంబంధాన్ని బలపర్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించక మునుపు 2011లో న్యాయశాఖలోని ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుసరించి ఈ ఏడాది స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారుచేసి హైకోర్టుకు వివరాలు తెలియజేశారు. ఆయన అకాడమీ డైరెక్టర్‌గా నియమితులు కావడం పట్ల బార్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తంచేశారు.

నారాయణపూర్ డ్యామ్‌ను
పరిశీలించిన నిపుణుల బృందం

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ ఇంజనీర్లు, న్యాయవాదుల బృందం ప్రత్యేక విమానంలో వెళ్లి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను శుక్రవారం పరిశీలించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విద్యానాథన్, అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు, న్యాయవాదులు రవీందర్‌రావు, విద్యాసాగర్, చీఫ్ ఇంజనీర్ నర్సింహారావు, ఒఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే, కోటేశ్వరరావు డిప్యూటీ డైరెక్టర్, కర్నాటక అడ్వకేట్ జనరల్ మధునాయక్‌లు రెండు రోజుల పాటు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. శనివారం కూడా వీరి పరిశీలన కొనసాగుతుంది. తొలి రోజు శుక్రవారం కర్నాటకలోని నారాయపూర్ డ్యామ్‌ను పరిశీలించారు. కృష్ణా జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ బృందం ప్రాజెక్టులను పరిశీలిస్తోంది.

నారాయణపూర్ డ్యామ్‌ను పరిశీలిస్తున్న నిపుణులు