ఆంధ్రప్రదేశ్‌

లేడీ డాన్ ఆచూకీ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 10: ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న కోల్‌కకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ చిక్కినట్టేచిక్కి తప్పించుకుంది. ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు కోల్‌కతా హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. జిల్లాలో నమోదైన కేసుల విచారణ కోసం రావాల్సి ఉండగా రాకపోవడంతో జిల్లా పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. అయితే సంగీత చటర్జీ కోల్‌కతా హైకోర్టులో మధ్యంతర బెయిల్ తీసుకోవడంతో దీనిని రద్దు చేసి చిత్తూరు జిల్లాలో నమోదైన కేసు విచారణలో భాగంగా తమకు అప్పగించాలని కోల్‌కతాకు వెళ్లిన ప్రత్యేక డిఎస్పీ గిరిధర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఇటీవల చిత్తూరు పోలీసులు కోల్‌కతాకు చెందిన బడా స్మగ్లర్ లక్ష్మణన్‌ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పోలీసులు కలకత్తాలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మణ్ భార్య సంగీత చటర్జీ ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్‌లను, రికార్డులను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతలోనే అక్కడ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో చిత్తూరు పోలీసులు వెనుతిరగాల్సి వచ్చింది. అయితే లక్ష్మణ్ జైలులో ఉండగానే సంగీత చటర్జీ ఎర్రచందనం దుంగలు రవాణాతో పాటు ఆర్థిక లావాదేవీలను కూడా కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈనేపథ్యంలో అనేక మంది బడా స్మగ్లర్లతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను విచారణ కోసం చిత్తూరుకు తరలించాలని యత్నించగా తనకు ఆరోగ్యం సరిగా లేదని పేర్కొంటూ బెయిల్‌ను పొడిగించుకుంటు వస్తోంది. ఈ తరుణంలో ఏ విధంగానైనా అరెస్ట్ చేసి ఈ కేసును ఛేదించాలన్న దృక్పథంతో చిత్తూరుకు చెందిన డి ఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు కలకత్తాకు వెళ్లాయి. ఇందులో భాగంగా మరో మారు సంగీత చటర్జీ ఇంటిలో దాడులు నిర్వహించి కొన్ని విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.