రాష్ట్రీయం

ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలు రాష్ట్ర నూతన రాజధాని గౌరవాన్ని పెంచేలాగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపేర్కొన్నారు. కృష్ణ నదీపరీవాహక ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 81 ఘాట్స్‌ల్లో భక్తులకు సకల సదుపాయాలను కల్పించటమే కాకుండా సుందీకరణ, అలంకరణాలతో అద్భుతమైన శోభను తీసుకురావాలని నిర్ధేశించారు. మూడు జిల్లాలోని పుష్కరపనులు చేపట్టిన ప్రభుత్వ శాఖలతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాల తొలిరోజు ఆగస్టు 12వ తేదీన సాయంత్రం నుండి కృష్ణ నదీకి హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈసమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై తొలిరోజు కృష్ణమ్మకు హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జూలై 19వ తేదీన ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకొని ట్రయల్న్ నిర్వహించనున్నారు. హారతి కార్యక్రమం పూర్తిగా సంప్రదాయబద్దకంగా నిర్వహించాలని హారతులు ఇచ్చే వేదపండితుల డ్రస్స్ కోడ్ నుండి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పండితులు ధరించే దుస్తులు, హారతి, బ్యాక్ డ్రాప్ ఎలా ఉండాలి అనే అంశంపై నిఫ్ట్‌తో డిజైన్ చేయిస్తున్నట్లు తెలిపారు.
హారతి కార్యక్రమం తర్వాత లేజర్‌షో ఉంటుందని ఈకార్యక్రమం పుష్కరాలకే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట్ మీద హారత కార్యక్రమం నిర్వహించాలని సియం సూచించారు. ఈకార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని సియం తెలిపారు. పుష్కరాల ఘాట్స్‌లు, భవానీ ఐల్యాండ్ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ పనులు చేపట్టి మరింత ఎక్కువ నీరునదిలో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఇరువైపుల ఆమర్చే విద్యుత్‌దీపకాంతులు ప్రత్యేక ఆకర్షణగా ఉండాలన్నారు. విజయవాడ నగరంలో రైల్వే ట్రాక్ రెండుపక్కలా రైలింగ్ ఏర్పాటుచేసి ప్లాంటేషన్ చేయాలని రైల్వే, మున్సిపల్ అధికారులకు సూచించారు. నెల రోజుల వ్యవధిలో స్పెషల్ పర్సస్ వెహికల్ ఏర్పాటుతో 30 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టంగా ఆదేశాలిచ్చారని గుర్తుచేస్తూ పుష్కర పనుల్లో రైల్వే అధికారులు సహకరించాలని కోరారు. విజయవాడ నగరంలో 60 అడుగుల రహదారి మార్గం ఏర్పాటులో స్థానికులు సహకరించి 30 ఎకరాల మేర స్థలాన్ని ఇచ్చారని అధికారులు చెప్పగా రైల్వేశాఖ అధికారులు సహకరించి తమ ఆధీనంలోనున్న భూమిని ఇస్తే అంతకు అంత స్థలాలను వేరే ప్రాంతంలో ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్న రైల్వే కట్టడాలను తొలగించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. వాటికి నష్టపరిహారంగా వేరేచోట స్థలం ఇస్తున్నందున రహదారి పనులను తక్షణం చేపట్టడానికి అనుమతులిచ్చి మున్సిపల్‌శాఖకు సహకరించాలని తెలిపారు. పుష్కర పనులకు ఇంకా మరో 50 రోజులు మాత్రమే మిగిలి వుందన్నారు. బారికేడింగ్ ఎక్కడ ఏర్పాటుచేయాలనేది ఆర్ అండ్ బి, పోలీస్ శాఖ అధికారులు కలిసి సమన్వయంతో నిర్ణయించాలని సిఎం తెలిపారు. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. మూడురోజుల ముందు నుంచి రిహార్సల్స్ జరపాలని పుష్కరం వెబ్‌సైట్ పేజీతో పాటు సిఎం డేష్‌బోర్డు నుంచి నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈసారి గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

పుష్కర లోగో ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు