రాష్ట్రీయం

10 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: మొత్తం పది మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 51 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 168 మార్కెట్ కమిటీలు ఉండగా, వీటిలో 51 మార్కెట్ కమిటీలకు నియామకాలు పూర్తి కాగా, మిగిలిన 117 మార్కెట్ కమిటీలకు వరుసగా నియమాకాలు చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జిల్లా అక్కపల్లిని,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గంధం శ్రీనివాస్‌ను, ఖానాపూర్‌కు నల్లా శ్రీనివాస్‌ను చైర్మన్‌గా నియమించారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా యుగంధర్‌ను నియమించారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తైదాల రవీందర్‌ను, హుస్నాబాద్ మార్కెట్ కమిటీకి లింగాల సాయన్నను చైర్మన్‌గా నియమించారు. మంథని చైర్మన్‌గా ఆకుల కిరణ్, రంగారెడ్డి జిల్లా ధరూర్ కమిటీ చైర్మన్‌గా రాజు నాయక్, మర్లపల్లి కమిటీ చైర్ పర్సన్‌గా ఎన్ సావిత్రిలను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మార్కెట్ కమిటీకి గౌని బుచ్చారెడ్డిని నియమించారు.

ఫ్యాప్సీ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 10: ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సి) ఎక్సలెన్స్ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఫ్యాప్సీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అవార్డుల కమిటీ చైర్మన్ విఎస్ రాజుతో కలిసి దరఖాస్తు విధివిధానాలను వివరించే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాలుగా పారిశ్రామికరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు బహుమతులను అందిస్తున్నట్టు చెప్పారు. ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, పరిశోధన, అబివృద్ధి, ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, టూరిజం ప్రమోషన్, చాంబర్ అసోసియేషన్, వ్యక్తిగత అభివృద్ధి, సమాజ సేవ రంగాల్లో మొత్తం 21 బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూలై 15 చివరి తేదీ అని, వివరాల కోసం 8008579625, 9848286640 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో రవీంద్ర మోడీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అడుగంటిన భూగర్భ జలాలు
315 మండలాల్లో ఆందోళన

హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈదురు గాలి, వడగళ్లతో రాష్ట్రంలో ఇటీవల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినప్పటికీ భూగర్భ జలాల పెరుగుదలలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మంచి నీటి ఎద్దడి సమస్య తీవ్రతరంగానే ఉంది. ఈ సారి నైరుతి రుతు పవనాలు సకాలంలోనే రాష్ట్రానికి తాకనుండటంతో ముందు ముందు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మే మాసంలో కురిసిన వర్షాలతో నాలుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినప్పటికీ ఆరు జిల్లాల్లో 20 శాతానికంటే తక్కువ నమోదు అయింది. వం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో గత మే మాసంలో భూగర్భ జలాలు 15.62 మీటర్ల అడుగుకు పడిపోయినట్టు నమోదు కాగా, ఈ ఏడాది మేలో 15.62 మీటర్లకు పడిపోయింది. రాష్ట్రం మొత్తంగా చూస్తే నిరుడు కురిసిన వర్షపాతం కంటే ఈ ఏడాది 25 శాతం తక్కువ నమోదు అయింది. రాష్ట్రంలో మే నెలలో నమోదు అయిన భూగర్భ జలాలలో 110 మండలాల్లో 15 మీటర్ల అడుగుకు, 78 మండలాల్లో 20 మీటర్ల అడుగుకు, 127 మండలాల్లో 20 మీటర్ల అడుగుకు పడిపోయాయి. రాష్ట్రంలో 459 రెవిన్యూ మండలాలకు గాను 315 మండలాల్లో భూగర్భ జల మట్టాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగింటిన జిల్లాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితి తీవ్రతరంగా ఉంది. ఈ జిల్లాల్లో 64 మండలాలకు గాను 52 మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల అడుగుకు పడిపోయాయి. ఆ తర్వాత మెదక్ జిల్లాల్లో 46 మండలాల్లో, నల్లగొండ జిల్లాలో 44 మండలాల్లో, కరీంనగర్ జిల్లాల్లో 41 మండలాల్లో, వరంగల్ జిల్లాలో 31 మండలాల్లో, నిజామాబాద్ జిల్లాలో 27 మండలాల్లో, ఖమ్మం జిల్లాలో 25 మండలాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో భూగర్భ జలాలు 15 నుంచి 20 మీటర్ల వరకు పడిపోయినట్టు నమోదు అయింది. అన్నింటికంటే హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలకు గాను 5 మండలాల్లో మాత్రమే 10 నుంచి 15 మీటర్ల అడుగుకు పడిపోయినట్టు నమోదు అయింది.

పిడుగుపాటుకు
అన్నదాతల
దుర్మరణం

మహబూబ్‌నగర్, జూన్ 10: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు రైతులు శుక్రవారం దుర్మరణం చెందారు. అందులో ఓ మహిళా రైతు తమ పొలంలో విత్తనాలు విత్తుతుండగా పిడుగుపడి మృతి చెందింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామపంచాయతీ పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన పురుగుల అంజమ్మ (35), మొగిలిగిద్ద గ్రామానికి చెందిన గౌలిగానీ చెన్నయ్య (48), చించోడ్ గ్రామానికి చెందిన గోపయ్య (46) అనే ముగ్గురు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. కాగా, చెన్నయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి సాయంత్రం తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు మృతి చెందాడు. అదేవిధంగా గోపయ్య తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా భారీ శబ్ధంతో కూడిన పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపడి మృతి చెందడంతో షాద్‌నగర్ మండలంలో తీవ్ర విషాదచాయాలు అలుముకున్నాయి. ఈ ప్రాంతంలో భారీ వర్షం కూడా కురిసింది.