రాష్ట్రీయం

తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 10: తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో రింగ్ రోడ్డులోని హంపి మఠం అవరణలో ఓ చిరుతపులి సంచరించింది. చిరుతపులి సంచరించిన దృశ్యాలు శుక్రవారం ఉదయం రోజువారి విధుల్లో భాగంగా సిసి టివి పుటేజీని పరిశీలిస్తున్న హంపి మఠం సిబ్బంది కొనుగొన్నారు. భయాందోళనకు గురైన మఠం సిబ్బంది టిటిడి అధికారులకు ఫిర్యాదు చేయగా వారు మఠానికి చేరుకొని సిసి టీవి పుటేజిని పరిశీలించారు. అందులో మఠం సమీపంలోని అటవీప్రాంతం నుంచి మఠం ఆవరణలోకి వస్తున్న చిరుతపులి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అక్కడే కాసేపు తచ్చాడిన చిరుత కొద్ది సేపు అనంతరం తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. సీసీ టివి పుటేజిని సేకరించిన టిటిడి అధికారులు వెంటనే అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. చిరుతపులి జాడను కొనుగొని జనావాసంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీశాఖ సిబ్బంది చిరుత పులి జాడను కనుగొనేందుకు అడవిలోకి వెళ్ళారు. కాగా చిరుత సంచారం గురించి తెలిసిన మఠం సిబ్బంది, అక్కడ బస చేసిన భక్తులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో భక్తులు ఎవరూ అటువైపు వెళ్లకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది.