ఆంధ్రప్రదేశ్‌

ఇక ఎన్టీఆర్ వైద్య పరీక్షా కేంద్రాలు మెడాల్ పరీక్షలకు చెల్లుచీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవల కింద రోగులకు అందుతున్న సేవలు ఇకపై ఎన్టీఆర్ వైద్య పరీక్షా కేంద్రాల ద్వారానే అందనున్నాయి. ఇప్పటి వరకూ మెడాల్ సంస్థ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించేవారు. ఇక మీదట వైద్య పరీక్షలన్నీ ఎన్టీర్ పేరిటే నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం ఆమె వైద్యాధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరు వద్ద 280 ఎకరాల్లో నిర్మించే మెడ్‌టెక్ హెల్త్‌పార్క్ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిహెచ్‌ఎండిఐసి) ఆధ్వర్యంలో ఈప్రాజెక్టుకు తుదిరూపు తీసుకురానున్నారు. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)లో ఇప్పటికే ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో జూలై నాటికి 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది వైద్య సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విమ్స్‌లో అత్యాధునిక వైద్య పరీక్షల కేంద్రాన్ని పిపిపి విధానంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.