రాష్ట్రీయం

శ్రీశైలంలో నీటి నిల్వ సాధ్యమేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 11: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఫలాలను ఈఏడాది రాయలసీమకు అందజేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై సీమరైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందించి ఆ ప్రాంతానికి చేరాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేస్తామని, ఆ తరువాత వాటిని కరవు ప్రాంతాలకు అందిస్తామని సిఎం ప్రకటించారు. సిఎం ప్రకటనతో రాయలసీమ రైతుల్లో ఓ పక్క ఆనందం వ్యక్తమవుతుండగా మరోపక్క పలు అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. పట్టిసీమ ఫలాలు సీమకు అందాలంటే శ్రీశైలంలో నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని, ఆ నీటిని రాయలసీమకు బదులు తెలంగాణకు తరలించుకుపోతారేమోనన్న భయం సీమ రైతుల్లో వ్యక్తమవుతోంది. రాయలసీమకు సాగు, తాగునీరు తరలించాలంటే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల మేర ఉండాలని ఆదేశాలున్నా వాటిని అమలుచేసిన దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సరికొత్త ఆదేశాలతో అట్టడుగు వరకూ నీటిని తోడి దిగువకు తరలిస్తున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు పట్టిసీమ మిగులు జలాల్లో సుమారు 80 టిఎంసిల మేర శ్రీశైలంలో నిల్వ చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నీటిపై కృష్ణాబోర్డు కఠినంగా వ్యవహరించి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించలేని పక్షంలో దిగువన నాగార్జున సాగర్‌కు తరలించుకుపోతే అడ్డుకోలేమని అంటున్నారు. శ్రీశైలంలో నీరు ఉంటే ఏదో ఒక సాకుతో కృష్ణాడెల్టాకు తరలించడానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడదని, అప్పుడు పట్టిసీమ ఫలితం కరవుసీమకు ఎలా అందుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందించాలంటే సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మిస్తే పూర్తిస్థాయిలో సాధ్యపడుతుందని వారు సూచిస్తున్నారు.
గోదావరి నదికి జూన్ ఆఖరు జూలై రెండో వారంలోపే పెద్దఎత్తున వరద వస్తాయని, దీంతో నదిపై ఉన్న జలాశయాలు నిండి దిగువకు నీరు వస్తుందని సాగునీటిరంగం నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులకు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వరద వస్తుందని, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండాలంటే సెప్టెంబర్ చివరి వరకూ ఆగాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 100 టిఎంసిల నీటిని కృష్ణానదికి తరలించాలన్న లక్ష్యంతో నిర్మించారని గుర్తుచేస్తున్నారు. గోదావరికి వరద ప్రారంభమయ్యేలోపు పట్టిసీమ పథకాన్ని సిద్ధం చేసి గోదావరి నీటిని కృష్ణాకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరోపక్క ఆగస్టు, సెప్టెంబర్‌లో కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం చేరే నీటిని రాయలసీమకు అందించాలని ప్రయత్నిస్తోందని వెల్లడిస్తున్నారు. ఇదే జరిగితే శ్రీశైలం జలాశయానికి నీటిచేరిక ప్రారంభమై 836 అడుగులకు చేరిన వెంటనే హంద్రీ-నీవా, 840 అడుగులకు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమలోని నాలుగు జిల్లాలకు, నెల్లూరు జిల్లాకు తరలించవచ్చని నిపుణులంటున్నారు. అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే ప్రశ్న. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీశైలం నీటిని కరవు సీమకు అందించాలని రైతులు, సాగునీటిరంగం నిపుణులు కోరుతున్నారు.