ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు ఇన్‌చార్జ్ డిఇఓగా నరసారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 11: నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారిగా రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ డైరక్టర్ కనక నరసారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఎం.జానకి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శనివారం జరగాల్సిన ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు వాయిదా పడ్డాయి. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులు అంతర్ జిల్లాల బదిలీలపై నెల్లూరు జిల్లాకు వచ్చారు. వీరికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు శనివారం నిర్వహించ తలపెట్టిన కౌన్సిలింగ్ వాయిదా పడింది. డి ఇ ఓతో పాటు కార్యాలయ ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో ఉద్యోగులంతా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడంతో ఈ కౌన్సిలింగ్ వాయిదా పడింది. కౌన్సిలింగ్ వాయిదా గురించి ఎటువంటి సమాచారం లేక హాజరైన ఉపాధ్యాయులంతా సాయంత్రం వరకూ పడిగాపులు కాసి చివరకు నిరుత్సాహంతో ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.