ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలను అడ్డుకుని.. తుది సమరానికి సిద్ధంకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 12: దశాబ్దాల కాలంగా వివాదంలో ఉన్న పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారమయ్యేంతవరకూ మీ ప్రాంతాల్లో వచ్చే ఎటువంటి ఎన్నికలనైనా అడ్డుకోవాలని ఉత్తరాంధ్రా జిల్లాల మేథావుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ సింహాచలం దేవస్థానం భూ బాధితులకు పిలుపునిచ్చారు. సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్సు స్టాండ్ ఎదురుగా భూ సమస్య పరిష్కారం కోరుతూ ధర్నా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శర్మ విలేఖరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారుల తీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఘాటుగా విమర్శించారు. విశాఖ నగరంలోని ప్రధాన సమస్యల్లో పంచ గ్రామాల భూ సమస్య ముందు వరసలో ఉందని ఆయన గుర్తు చేశారు. రెండు పార్లమెంటు నియోజక వర్గాలు, అయిదు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వేలాది కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా భూ సమస్యతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఏళ్ళుగా అనేక విధాలుగా సమస్య కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు దిగిరాకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంతిమ పోరాటానికి సిద్ధం కాక తప్పదని ఆయన బాధితులకు స్పష్టం చేశారు.
సమస్య పరిష్కరించకపోతే పార్టీలను ఓడిస్తామన్న పాత చింతకాయ పచ్చడి నినాదాలకు స్వస్తిపలికి ఎన్నికలనే అడ్డుకుంటామన్న సరికొత్త నినాదంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందిచుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కి లేఖలు రాసి సమస్య తీవ్రతను వ్యక్తపరచాలని ఆయన నిర్దేశించారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ అవిశ్రాంతంగా పోరాటం సాగించాలని అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తానని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట బాధితులను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని నడపాలని ఆయన పిలుపునిచ్చారు. భూ సమస్యను పరిష్కరిస్తే ప్రభుత్వానికి వేల కోట్ల రూ.లు ఆదాయం వస్తుందని ఎమ్మెల్సీ శర్మ చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా భూములను ఆక్రమించుకుని ఉన్న సంపన్నుల ప్రయోజనాలే ముఖ్యమంత్రికి ముఖ్యంగా కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ ధర్నాలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ, సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు టివి కృష్ణంరాజు సమస్యపై మాట్లాడారు.