ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఆంధ్ర రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలను రూపొందించి ఈ నెల 15వ తేదీలోపల పంపించాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండు అంకెలు అంటే 15 శాతం వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే మండలాలు, జిల్లాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు సమర్పించారు. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రణాళికలను రూపొందించారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఎమ్మెల్యేలు తాము చేసిన సేవలను చెప్పుకునేందుకు వీలుంటుంది. ప్రతి నియోజకవర్గంలో సామాజిక, ఆర్థిక రంగంలో చేసిన సేవలపై ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్రం వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సాలీనా రూ. 350 కోట్లను కేటాయిస్తోంది. ఈ నిధులను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నియోజకవర్గాల వారీగా కేటాయిస్తారు. నియోజకవర్గాల వారీగా నిధులు విడుదల కావాలంటే ఆ నియోజకవర్గం నోడల్ ఆఫీసర్, ఎమ్మెల్యే కలిసి ప్రణాళికను తయారుచేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రణాళిక శాఖకు పంపాలి. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గంలో దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాల అమలు, అక్షరాస్యత, తలసరి ఆదాయం, మంచి నీటి వనరులు, రోడ్లు, డ్రైనేజీల గురించి ప్రణాళికలో పేర్కొనాలని ప్రభుత్వం కలెక్టర్లను కోరింది.