ఆంధ్రప్రదేశ్‌

పోర్టు కడితే మీరే అభివృద్ధి చెందుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 8: బందరు ఓడరేవు నిర్మాణానికి నేను సిద్ధంగానే ఉన్నా. మీ ప్రాంత అభివృద్ధికి దోహదపడే పోర్టు కోసం మీరు కూడా ముందుకు రావాలి. రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు భూసమీకరణ ద్వారా భూములను తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ కొంత మంది భూసేకరణ ద్వారా ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా భూసేకరణ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను. ప్రస్తుతం జన్మభూమి గ్రామసభలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖాధికారులు అందుబాటులో లేని కారణంగా భూసేకరణ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నాను. వారం రోజుల్లో ఆర్థిక శాఖ, పోర్టు శాఖ, పోర్టు నిర్మాణ సంస్థ నవయుగ వారితో భేటీ అయి భూసేకరణకు ఏ మేర సాధ్యాసాధ్యమో తెలియచేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. బందరు ఓడరేవు భూముల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు గాను సోమవారం రాత్రి సచివాలయంలో స్థానిక ఎమ్మెల్యే, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నేతృత్వంలో పోర్టు ప్రతిపాదిత గ్రామాలైన కరగ్రహారం, గోపువానిపాలెం, మేకావానిపాలెం, తపసిపూడి, మంగినపూడి, పోతేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ అర్జునుడు సీఎంకు వివరించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజార్టీ రైతులు మేమంతా చిన్న, సన్నకారు రైతులమని పూలింగ్ వల్ల తక్షణ ప్రయోజనం పొందలేమని సీఎంకు తెలియజేశారు. భూసేకరణ ద్వారా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పూలింగ్ వల్ల తక్షణ ప్రయోజనం లేకపోయినా భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. సాధ్యమైనంత వరకు పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే బాగుంటుందని తెలిపారు. మరికొంత మంది రైతులు తక్షణ ప్రయోజనం కోసం కొంత భూమిని భూసేకరణ ద్వారా, శాశ్వత ప్రయోజనం కోసం మరికొంత భూమిని పూలింగ్‌లో ఇస్తామని చెప్పారు.