ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ పాలనలో దెయ్యాలకూ పెన్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. పార్టీలకు అతీతంగా చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలను అందించడంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జన్మభూమికి ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేస్తూ రచ్చ చేస్తోందని విమర్శించారు. గత పాలకుల హయాంలో సంక్షేమ ఫలాలను అర్హులకు అందించకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వైఎస్ పాలనలో దెయ్యాలు కూడా పింఛన్లు అందుకున్నాయని ఎద్దేవా చేశారు. వితంతు పెన్షన్లను వైసీపీ నాయకులైన మగాళ్లు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వైఎస్ పాలనలో జరిగిన రచ్చబండలో వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని, ఒక్క అర్జీని కూడా పరిష్కరించలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, బయోమెట్రిక్‌తో అర్హులకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని వివరించారు. మిగులు బడ్జెట్ ఉన్న వైఎస్ ప్రభుత్వం 13 జిల్లాలకు భోగస్ పెన్షన్లు పోగా నికరంగా ఇచ్చింది 39 లక్షల మందికి మాత్రమేనన్నారు. భోగస్ పెన్షన్లతో వందల కోట్లు అవినీతి చేశారని తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకోటి మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారన్నారు. వైఎస్ ప్రభుత్వం కంటే చంద్రన్న ప్రభుత్వం అదనంగా 11 లక్షల పెన్షన్లు ఇస్తోందన్నారు. వైఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రూ.200లు మాత్రమే ఇచ్చి, కేంద్రం ఇచ్చిన దాన్ని తాను ఇచ్చినట్టు అబద్ధపు ప్రచారం చేసుకున్నారన్నారు.చంద్రన్న ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా రూ.800 కలిపి రూ.1000 పెన్షన్ ఇస్తున్నదన్నారు. హిజ్రాలకు కూడా రూ.1500 పెన్షన్ ఇస్తున్నదని గుర్తుచేశారు. అర్హత ఉంటే కుటుంబంలో ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇంకా అర్హులుంటే వారికీ ప్రభుత్వ ప్రయోజనాలను అందజేస్తామని తెలిపారు.