ఆంధ్రప్రదేశ్‌

గీత కార్మికులకు మేలు చేసేలా నూతన కల్లు విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలానికి రూపొందించిన నూతన కల్లు విధానంతో రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ కల్లుగీత కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నూతన కల్లు పాలసీపై ప్రభుత్వం జీవో నెం.11 జారీ చేసిందన్నారు. నూతన పాలసీలో భాగంగా పన్ను మినహాయించడంతోపాటు కల్లు విక్రయించుకునే సౌలభ్యం చెట్టు నుంచి 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కల్లు గీత కార్మికులకు ఆర్థికంగా ఎంతో లాభిస్తుందన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెట్లెక్కి కల్లుతీసే గీత కార్మికుల నుంచి వసూలు చేసే పన్నును రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2017-22 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం నూతన పాలసీ రూపొందించిందన్నారు. ఈ పాలసీలో భాగంగా కల్లుగీత కార్మికుల నుంచి వసూలు చేసే పన్నును ప్రభుత్వం నిలిపేసిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న లక్షా ఆరువేల మంది గీత కార్మికులకు ఏటా రూ.3.43 కోట్ల మేర లబ్ధి కలుగుతుందన్నారు. కల్లు విక్రయించుకునే పరిధిని ప్రభుత్వం పెంచిందన్నారు. కల్లు తీసే సమయంలో చెట్టు మీద నుంచి పడి గాయపడి అంగవైకల్యం ఏర్పడిన గీత కార్మికులకు వయస్సుతో నిమిత్తం లేకుండా, వికలాంగులకు అందజేసే విధంగా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.