ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన పుస్తక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ గడచిన 29 సంవత్సరాలుగా స్వరాజ్య మైదానంలో నిరాటంకంగా ఏర్పాటు చేస్తున్న పుస్తక మహోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిసాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవాలు కృష్ణా జిల్లాకే పరిమితం కాకుండా గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం జిల్లాల నుంచి కూడా పాఠకులు.. వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ దఫా రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాలకు చెందిన 300కు పైగా ప్రచురణకర్తలు, వివిధ ప్రభుత్వ సంస్థల పుస్తకాలు ఈ సంబరాల్లో కొలువుదీరాయి. ఈ మహోత్సవాలను ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్టీఆర్ ట్రస్ట్ రూ.50 లక్షలు మేర ఇతోధికంగా ఆర్ధిక సాయం అందజేసినా ముందెన్నడూ లేని రీతిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ 11 రోజుల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరిగాయి. అయితే గతం కంటే సందర్శకుల సంఖ్య ఆపై వ్యాపారాలు బాగా తగ్గుముఖం పట్టాయని తెలిసింది.