ఆంధ్రప్రదేశ్‌

మసాలా ముసుగులో గుట్కా తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 12: చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఆన్సియంట్ మసాలా పొడులు తయారీ పేరుతో గుట్కాలను తయారుచేసి అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణవనం శివార్లలో రసం, సాంబారు పొడులు తయారు చేసే పరిశ్రమ నడుస్తోంది. ఇది పొడులు తయారు చేసే పరిశ్రమని అందరూ భావించారు. అయితే ఈ పొడుల ముసుగులో పరిశ్రమల నిర్వాహకులు ప్రమాదకరమైన గుట్కాను తయారు చేస్తున్న సమాచారం చిత్తూరు పోలీసులకు అందింది. దీంతో శుక్రవారం ఆ పరిశ్రమపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ రసం పొడులు తరలించే కంటైనర్‌ను తనిఖీ చేశారు. పైన రసం, సాంబరు పొడుల ప్యాకెట్లు ఉన్నా వాటి కింద గుట్కా ప్యాకెట్లను కనుగొన్నారు. ఈ విషయం తెలుసుకుని పాత్రికేయులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు మీడియా లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గుట్కా ప్యాకెట్లను ఇక్కడే తయారు చేస్తున్నారా, లేకుంటే ఇతర ప్రధాన స్థావరాల నుంచి తీసుకువచ్చి తరలిస్తున్నారా అనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. పరిశ్రమ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. దీని గురించి ఎలాంటి సమాచారం పోలీసులు బయటకు వెల్లడించలేదు. దీనిపై స్థానికులు మాత్రం నిర్ఘాంతపోతున్నారు. చిత్తూరు జిల్లాలో బయటపడ్డ గుట్కా వ్యాపారం గురించి ఆశ్చర్యపోయిన పోలీసులు దీనిపై మరింత లోతైన దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు.