ఆంధ్రప్రదేశ్‌

ఆది దంపతులకు రావణ వాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 14 : సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లు రావణ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చక వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం గుండా తీసుకురాగా రాజగోపురం నుంచి మాడావీధుల్లో మేళతాళాల నడుమ గ్రామోత్సవం ఎంతో వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అడుగడుగునా కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.

చిత్రం..రావణ వాహనంపై ఆది దంపతులు