ఆంధ్రప్రదేశ్‌

సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 16: మన సంస్కృతి, సాంప్రదాయాలు భగవంతుడు ఇచ్చిన వరమని, వాటిని మన ఆస్తిగా భావించాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 నుంచి నాలుగు రోజులపాటు తన స్వగ్రామం నారావారి పల్లెలో వేడుకలు జరుపుకుని, మంగళవారం మధ్యాహ్నం టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జన్మభూమిని అభివృద్ధి పరచి రుణం తీర్చుకోవాలన్నారు. గత 15 సంవత్సరాల క్రితం తన సతీమణి భువనేశ్వరి సంక్రాంతి రోజున స్వగ్రామానికి వెళ్లాలని పట్టుపట్టిందన్నారు. అప్పటి నుంచి సంక్రాంతి సంబరాలను జన్మస్థలంలో జరుపుకుంటున్నానన్నారు. నేడు పర్వదినాలలో స్వగ్రామాలకు వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఈక్రమంలో తానున్న గ్రామాల్లో రెండు మూడు గదులు కట్టుకుని అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. తద్వారా గ్రామం అభివృద్ధి చెందడమే కాకుండా గ్రామస్థులు కూడా ఆనందంగా పండుగలు కూడా జరుపుకుంటారన్నారు. కష్ట సుఖాలను పాలుపంచుకోవడానికి, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి గతంలోకన్నా భిన్నంగా పండుగ వాతావరణంలో ఈనెల 2వ తేదీ నుంచి నేటి వరకు జన్మభూమి-మా ఊరు, భోగి, సంక్రాంతి, కనుమలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేసుకున్నామన్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. స్మార్ట్‌విలేజ్, స్మార్ట్ సిటీ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
జిల్లాకు హంద్రీ-నీవా నీరు
హంద్రి-నీవా పుట్టపర్తి వద్ద చిన్న సమస్య వల్ల హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యమైందని త్వరలో అధిగమించి మొదటి మదనపల్లికి, తరువాత పుంగనూరు, పలమనేరు, కుప్పంకు తాగునీరు, సాగునీరు అందిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదే సమయంలో మదనపల్లి నుంచి శ్రీనివాసపురం తీసుకువచ్చి పీలేరు నియోజక వర్గ పరిధిలోవున్న వాల్మీకి పురం,అక్కడ నుంచి చంద్రగిరి, అక్కడ నుంచి చిత్తూరుకు నీళ్లు తీసుకువెళ్లేవిధంగా డిజైన్ చేశామన్నారు. ఈ ఏడాదికే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్‌లు కూడ నిర్మించి అన్ని చెరువులకు నీరును అందిస్తామన్నారు. మరోవైపు గాలేరు-నగరికి సంబంధించిన మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి సోమశిల, స్వర్ణముఖి ద్వారా కూడా నీటిని పిచ్చాటూరు వరకు తీసుకు వస్తామన్నారు ఈక్రమంలో కరువురహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. చిత్తూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉందని, నెల్లూరు జిల్లా దగదర్తివద్ద విమానాశ్రయం ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు కూడా జిల్లాకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అటు చెన్నయ్, ఇటు బెంగళూరు, మరో వైపు అమరావతికి రోడ్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే రోడ్డును వెంకటగిరికి అనుసంధానం చేసి చిత్తూరుకి రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు.