ఆంధ్రప్రదేశ్‌

వైఫల్యం మీదంటే.. మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: ఉపాధి హామీ పథకంతో అనుసంధానమైన గృహ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల్లో జాప్యానికి కారణం మీరంటే మీరంటూ హౌసింగ్, పంచాయితీరాజ్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సీఎం జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. విజయవాడ ఉండవల్లిలో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన శుక్రవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఎండీ కాంతిలాల్ దండే గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో అనుసంధానమై నిర్మిస్తున్న ఇళ్లకు నిధుల విడుదల్లో జాప్యం జరుగుతోందన్నారు. 50 వేల రూపాయల వరకూ నిధులు విడుదల చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 125 కోట్ల రూపాయల మేర నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ఉపాధితో అనుసంధానమైన ఇళ్ల నిర్మాణంలో గృహ నిర్మాణ శాఖ మస్తర్లను సక్రమంగా నిర్వహించని కారణంగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై కాంతిలాల్ దండే ప్రతిస్పందిస్తూ, ఉపాధి పనులకు సంబంధించి అన్ని రికార్డులను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఘోరంగా విఫలయాయ్యమని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రెండు రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి, ఎలా అరోపిస్తారని ప్రశ్నించారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని ఇద్దరూ ఒత్తిడిలో అలా మాట్లాడారంటూ సర్ది చెప్పారు. రాష్ట్రానికి నిధులు కావాలని, కేంద్ర నిబంధనలు పాటించకపోతే, నిధులు రాని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు లేని వాటికి రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.