ఆంధ్రప్రదేశ్‌

అధికారులు బాగా కష్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 19: జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది బాగా కష్టపడి పనిచేసి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. శుక్రవారం సచివాలయ సమీపంలో నిర్వహించిన జన్మభూమి అవార్డుల సభలో ఆయన ప్రసంగించారు. తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 18 సార్లు జన్మభూమి నిర్వహించానని, కొత్త రాష్ట్రంలో 5 సార్లు నిర్వహించానని, అవన్నీ తనకు సంతృప్తి కలిగించాయని చెప్పారు. 2020 నాటికి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, ఆనందాంధ్రప్రదేశ్‌ను చూడటమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకూ సహకరించాలని తాను ప్రధానిని కోరానన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి వచ్చే వరకూ విశ్రమించనన్నారు. కాగా జన్మభూమి కార్యక్రమాలు బాగా నిర్వహించిన జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. అందులో భాగంగా అవార్డులు దక్కిన వారికి ముఖ్యమంత్రి వాటిని ప్రదానం చేశారు. చంద్రన్నబీమాకు మొదటి ర్యాంకు రాగా, స్ర్తి-శిశుసంక్షేమానికి రెండు, పెన్షన్లకు మూడవ ర్యాంకు లభించింది. వాటిలో కృష్ణా, విశాఖ, అనంతపురం జిల్లాలకు వరసగా ఒకటి, రెండు, మూడు టాప్‌గా నిలిచాయి. ఆర్ధిక పరమైన ఫిర్యాదులను పరిష్కరించడంలో కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు వరసగా ఒకటి, రెండు, మూడు ర్యాంకులు లభించాయి. ఆర్ధికేతర ఫిర్యాదులను పరిష్కరించడంలో కృష్ణా, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ జిల్లా అవార్డులు దక్కాయి. కాగా జన్మభూమి పదిరోజుల కార్యక్రమాల్లో పనిచేసిన 131 మందికి అవార్డులు దక్కాయి. సభలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జన్మభూమి నిర్వహణలో ప్రథమస్థానంలో నిలిచిన కృష్ణాజిల్లా తరఫున అవార్డు అందుకుంటున్న కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం