ఆంధ్రప్రదేశ్‌

దరఖాస్తుదారుల వివరాలు లేకుండానే గృహాల కోసం ఏడు లక్షల అర్జీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: దాదాపు ఏడు లక్షల మంది తమ వివరాలు ఇవ్వకుండానే ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా, ఈ విషయాన్ని రియల్ టైమ్ గవర్నెన్సు సీఈవో బాబు అహ్మద్ వెల్లడించడం గమనార్హం. జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల కోసం వచ్చిన 21 లక్షల దరఖాస్తుల్లో ఏడు లక్షల దరఖాస్తులదారుల వివరాలు లభించడం లేదని చెప్పారు. ప్రజాసాధికార సర్వే డేటాతో దరఖాస్తుదారుల వివరాలు తనిఖీ చేశామన్నారు. చాలా మంది దరఖాస్తుదారుల వివరాల ఆచూకీ డేటాలో లభించలేదన్నారు. కేవలం ఒక పేరుతో దరఖాస్తు చేశారని, ఇతర వివరాలు ఇవ్వలేదన్నారు. ఆ దరఖాస్తుదారుని వివరాల కోసం ఆయా గ్రామాల డేటా సహా పరిసర గ్రామాల డేటానూ పరిశీలించామన్నారు. దీనిపై సీఎం రెండు రికార్డులను నిర్వహించాలన్నారు.