ఆంధ్రప్రదేశ్‌

గోదా‘వర్రీ’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 19: వరి పొట్ట దశలో సరిపడా జలాలు అందించగలిగితే రబీ గట్టెక్కినట్టే.వరి సాగులో ఇదే కీలక దశ.ఈ దశలోనే సాగు జలాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. రబీ వరి సరిగ్గా. ఈ దశకు చేరుకునే సమయంలోనే గోదావరి నదిలో సహజ జలాలకు మరీ గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల నుంచి సమర్ధవంతంగా గట్టెక్కడాన్ని బట్టే గోదావరి బేసిన్‌లోని రబీ ఆధారపడి ఉంటుంది. దాదాపు రూ.1200 కోట్ల విలువైన పంటను సంరక్షించుకోవాల్సిన కీలక తరుణమది. ఇటువంటి కీలక దశ ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉంటుంది. ఆ సమయంలో రబీ వరికి పూర్తి స్థాయిలో ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా కాటన్ బ్యారేజి నుంచి సమృద్ధిగా సాగు జలాలను అందించాల్సి ఉంది. ఎపుడూ ఇటువంటి కీలక దశలోనే సీలేరు జలాలపై ప్రధానంగా ఆధార పడాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో గోదావరి నదిలో సహజ నీటి లభ్యత మరింత క్షీణ దశకు చేరుతుంది కాబట్టి అవసరమైతే బలిమెల నుంచి విద్యుత్ వినియోగానికి వాడుకునే జలాలను సైతం అదనంగా గోదావరి నదిలోకి మళ్ళించి వినియోగించుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది సీలేరు జలాలను ముందుగానే వినియోగించుకోవడం జరిగింది. గోదావరి నదిలో సహజ జలాల లభ్యత బాగా తగ్గిపోవడంతో ప్రస్తుత సమయంలో రోజుకు 4వేల టిఎంసిల చొప్పున సీలేరు జలాలను వాడుకోవాల్సింది పోయి ప్రస్తుతం సుమారు 6500 టిఎంసిల చొప్పున వాడేసుకుంటున్నాం. సాధారణ స్థాయి కంటే అదనంగా 2 వేల నుంచి 2500 టిఎంసిల వరకు వినియోగించుకుంటున్నాం. గోదావరి బేసిన్‌లో రబీ అవసరాలకు సంబంధించి సుమారు 80 టిఎంసిల జలాలతో గట్టెక్కవచ్చని అంచనా వేసి రబీ కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ఇందులో సగం వరకు గోదావరి నదిలో సహజ నీటి లభ్యత ద్వారా సమకూరితే. మిగిలిన నీటిని సీలేరు నుంచి తీసుకోవచ్చని అంచనా. సాధారణంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు ఎక్కువ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సరిపడా నీటిని అందించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో డెల్టాలకు సాగు నీటికి అధిక డిమాండ్ వుంటుంది. ఆ సమయం సరిగ్గా ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంచుమించు మార్చి 20వ తేదీ వరకు ఉంటుంది. ఆ సమయంలో సీలేరు జలాలను బలిమెల నుంచి వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటికే సీలేరు నుంచి 25 టిఎంసిలు వాడేసుకోవడం జరిగింది. అదే విధంగా కాటన్ బ్యారేజి నుంచి ఇప్పటికి 37 టిఎంసిలు డెల్టా కాలువలకు విడుదల చేశారు. వాస్తవానికి రబీ అవసరాలకు 80 టిఎంసిలు అవసరంగా అంచనా వేసుకుంటే అందులో ఇంకా 50 టిఎంసిలు ఉన్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన జలాల్లో కేవలం 12 టిఎంసిలే గోదావరి సహజ లభ్యత. అంటే అంత తక్కువ స్థాయిలో నీటి లభ్యత దిగజారిపోయింది. సాధారణంగా సీలేరు నుంచి 45 టిఎంసిలు, గోదావరి నదిలో సహజ లభ్యత ద్వారా సుమారు 25 టిఎంసిలు వెరసి 70 టిఎంసిలతో ఏదో విధంగా గోదావరి రబీ అవసరాల నుంచి గట్టెక్కవచ్చని అంచనా వేస్తారు. కానీ సీలేరు నుంచి ఇప్పటికే 25 టిఎంసిలు వాడేస్తే ఇక 20 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతమైతే డ్రెయిన్ల నీరు గానీ, క్రాస్ బండ్లు వేసి మోటార్లతో తోడి నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి లేకుండానే బ్యారేజి నుంచి సరఫరా అవుతోంది. కీలక దశకు చేరుకునే సమయానికే నీటి డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే కాస్తంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపధ్యంలో గోదావరి బేసిన్‌లో కాటన్ బ్యారేజీ ద్వారా సుమారు 6.82 లక్షల ఎకరాల వరి సాగుకు సంబంధించి ఇంకా 10 శాతం వరకు నాట్లు పడలేదు. శివారు ప్రాంతాల్లో నీటికి ఇబ్బంది ఎదురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ నాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇప్పటికే నాట్లు లక్ష్యం మేరకు పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరు నాటికే పూర్తిస్థాయిలో నాట్లు పడాలి. కానీ ఇప్పటికీ డెల్టాల్లో నాట్లు పూర్తి కాలేదు. రబీ దాదాపు నెల రోజులు ఆలస్యంగా సాగుతోంది. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో నాట్లు మందకొడిగా జరుగుతున్నాయి. కేవలం ఈ 10 శాతం నాట్లు కూడా కోనసీమలోనే పూర్తికావాల్సి ఉంది. మెట్ట, మైదాన ప్రాంతాల్లో బోర్ల ద్వారా సాగయ్యే ఆయకట్టుకు సంబంధించి సకాలంలో నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం గోదావరి నదిలో నీటి లభ్యత సవ్యంగానే ఉందని జల వనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. గత పది రోజుల కిందట కాటన్ బ్యారేజీ వద్ద 12.79 మీటర్లకు పడిపోయిన నీటి మట్టం కాస్తా ఇపుడు మళ్ళీ 13.32 మీటర్లకు చేరుకుంది. 8.70 అడుగుల స్థాయిలో నీటి మట్టంలో నీటి నిల్వలు ఉన్నాయి. తూర్పు డెల్టాకు 2880 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1430 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3840 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. గోదావరి నదిలో ప్రస్తుతం 8153 టి ఎం సిల ఇన్‌ఫ్లో ఉంది.

చిత్రం..గోదావరి నదిలో సహజ నీటి లభ్యత క్షీణించడంతో బయటకు తేలిన ఇసుక తినె్నలు