ఆంధ్రప్రదేశ్‌

చారిత్రక రచనలు మరిన్ని రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: తెలుగువారి చరిత్రకు సంబంధించిన పరిశోధనా గ్రంథాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రను హేతు దృష్టితో పరిశీలించి శాసన, సాహిత్య ఆధారాలతో సాధికారిక రచనలు వెలువడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ రచించిన ‘శ్రీ కృష్ణదేవరాయలు వంశ మూలాలు’ అనే చారిత్రక పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆయన శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో గండికోట ఉత్సవాల్లో భాగంగా ఆవిష్కరించాల్సిన ఈ గ్రంథాన్ని తన దావోస్ పర్యటన కారణంగా సచివాలయంలో ఒక రోజు ముందుగానే ఆవిష్కరించానన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజవౌళి, పుస్తక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.