ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో 22న జాబ్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: నిరుద్యోగ యువతకు బాసటగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (అపిటా) అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా జాబ్ ఫెయిర్‌లను నిర్వహిస్తూ, స్థానికంగా విద్యావంతులైన యువకులకు పలు ప్రతిష్ఠాత్మకమైన ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 22వ తేదీన కర్నూలులోని సుంకేశుల రోడ్‌లో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ ఫెయిర్‌లో 130 ఉద్యోగ నియామకాలు చేపడతారు. ప్రత్యేకంగా ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాలివ్వడంపై ఈసారి జాబ్ ఫెయిర్‌లో దృష్టి పెట్టారు. కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ అర్హతలున్నవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖ ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇప్పటికే ముందుకు వచ్చింది. ఇంకా అనేక సంస్థలు ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొంటాయి. జాబ్ ఫెయిర్ జరిగే సెయింట్ జోసెఫ్ కళాశాలలో 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు దీప్తి కిషోర్ (9989930780)ని సంప్రదించాల్సి ఉంటుందని అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది.