ఆంధ్రప్రదేశ్‌

కుయ్యో.. మొర్రో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 21: అత్యవసర పరిస్థితుల్లో ఏసమయంలోనైనా నేనున్నానంటూ కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ మరుక్షణమే ప్రత్యక్షమై క్షతగాత్రుల ప్రాణాలకు భరోసానిచ్చిన 108 అంబులెన్స్‌లు నేడు కుయ్యో.. మొర్రో అంటూ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అక్కరుకు రాని మందులు, వెంటాడుతున్న వాహన మరమ్మతులు, చాలీచాలని సబ్బంది.. వెరశి రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ల కూత సన్నగిల్లేలా చేస్తున్నాయి. స్వచ్ఛంద సేవలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన 108 సేవలు నేడు దయనీయంగా మారాయి. ప్రభుత్వం అత్యవసరంగా దయతలిస్తే తప్ప 108 నడిచే పరిస్థితి నేడు కనిపించడం లేదు. 2005 ఆగస్టు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా సుమారు 70కోట్ల రూపాయల సొంత నిధులతో నాటి సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు 108 సేవలకు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో కేవలం 50 వాహనాలతో నడిచిన ఈ సేవలను రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని 800 వాహనాల వరకూ విస్తరించారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు 468 వాహనాలను కేటాయించగా ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నా ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. సత్యం కంప్యూంటర్స్‌లో నెలకొన్న అనిశ్చితితో ఈ సేవలను జీవీకే సంస్థ తన భుజాలపై వేసుకుంది. వాహనాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల చెల్లింపులో విఫలం కావడం, ఉద్యోగులు, ప్రజల తీవ్ర నిరసనల మధ్య 2017 డిసెంబర్ 13 నుండి రాష్ట్రంలో 108 సేవలను యుకేఎస్‌ఎఎస్‌డీవీజే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. సంస్థలు మారినప్పటికీ 108 నిర్వహణలో లోపాలు మాత్రం సరికాలేదు. 108 వాహనంలో ఐదుగురు సిబ్బందితో పాటు అత్యవసర వినియోగం కోసం 103 రకాల మందులను సంస్థ సరఫరా చేయాల్సి ఉండగా నామమాత్రపు చర్యలతోనే సరిపుచ్చుతున్నారు. అవసరాలకు తగినంతగా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. దీనికితోడు వాహనాల మరమ్మతుల కోసం అప్పటి జీవీకే సంస్థ చేసుకున్న ఒప్పందాలకు అనుసరించి ఖర్చు చెల్లించకపోవడంతో మెకానిక్ షెడ్ యాజమాన్యం వాహనాలను రహదారిపైకి రానివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా సుమారు 80 వరకు వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వీటి నిర్వహణ ఖర్చుల కింద జీవీకే సంస్థ సుమారు 10 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఇక సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మూడు నెలలుగా వారికి యాజమాన్యం జీతాలు కూడా చెల్లించడం లేదు. ఒక్కొక్కరికి సుమారు 40 వేల రూపాయల వరకు బకాయి పడింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కూడా చెల్లించలేదని సిబ్బంది చెబుతున్నారు. నూతన యాజమాన్యం వచ్చినప్పటికీ ఉద్యోగ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేదని 108 కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్ ఆదివారం ఇక్కడ తెలిపారు. యాజమాన్యం జీతాలు చెల్లించనప్పటికీ అత్యవసర విభాగంలో ఉన్నందున ప్రజలకు ఇబ్బందలు తలెత్తకుండా తాము సేవలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదేవిషయమై ముఖ్యమంత్రి సహా సంబంధింత శాఖ మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు అందించినట్లు చెప్పారు. ఇంతటి దయనీయ స్థితికి చేరిన 108 సేవలపై ప్రభుత్వం అత్యవసరంగా స్పందించాల్సిన అవసరముంది.