ఆంధ్రప్రదేశ్‌

రోజువారీ ధరలతో మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 21 : పెట్రోల్ ధర ఒక రూపాయి పెరిగినా రోడ్లెక్కి ఆందోళనలు చేసిన జనం ఇప్పుడు ఎంత ధర పెరిగినా వౌనంగానే ఉంటున్నారు. రోజువారీ ధరల మార్పు నిర్ణయంతో ప్రతి రోజూ పెట్రోల్ ధర పెరుగుతూ లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువవుతున్నా ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గత 50 రోజుల్లో లీటర్ పెట్రోర్ ధర ఏకంగా రూ. 10.43 పెరిగినా నోరు విప్పకుండా భారం మోస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు లోలోన తీవ్ర ఆగ్రహంతో ఉన్నా అవసరమైన సమయంలో బహిరంగ పడతారన్న భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం రోజు వారీ ధరల మార్పు నిర్ణయం తీసుకున్న తరువాత 3 రోజులు మాత్రమే తగ్గుదల కనిపించిందని మిగిలిన అన్ని రోజుల్లోనూ ధరల్లో పెరుగుదల నమోదవుతోందని పెట్రో డీలర్లు సైతం పేర్కొంటున్నారు. కర్నూలులో డిసెంబర్ 1వ తేదీ లీటర్ పెట్రోల్ ధర రూ. 67.71 ఉండగా 21వ తేదీ ఆదివారం నాటికి అది రూ. 78.14లకు చేరింది. అంటే సరిగ్గా 50 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ. 10.43 పెరిగినట్లు పెట్రోల్ డీలర్ల ద్వారా వెల్లడవుతోంది. ఇక డిసెంబర్ 1వ తేదీ రూ. 67.71, 15వ తేదీ రూ. 70.50, ఈ ఏడాది జనవరి 1వ తేదీ రూ. 71.78, 15వ తేదీ రూ. 74.20 ఉండగా తాజాగా రూ. 78.14గా ఉంది.
ఇక గత వారం రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 3.90 పెరగడం గమనార్హం. పెట్రోల్ ధరతో పాటు డీజిల్ ధర కూడా గత 50 రోజుల్లో అదేస్థాయిలో పెరిగినట్లు డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెరిగినా ఇక్కడ మాత్రం పెరుగుదలే నమోదవుతోందని వారు వెల్లడిస్తున్నారు. కాగా పెట్రోల్ ధర దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. పొరుగున ఉన్న కర్నాటక కంటే మన రాష్ట్రంలో పెట్రోల్‌పై లీటరుకు రూ. 6, తమిళనాడు కంటే రూ. 4, తెలంగాణ కంటే రూ. 2 ఎక్కువగా ఉందని వారంటున్నారు. కాగా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారులకు ఊరట లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక చిన్న తేడాతో దేశ వ్యాప్తంగా ఒకే ధర అమలులో ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. పెట్రోల్ ధరల్లో పెరుగుదలతో ఉడికిపోతున్న ప్రజలు భవిష్యత్తులో ఏదో ఒక రోజు బహిరంగపడి తీవ్ర చర్యలకు దిగుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.