ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసమస్యలపై నేనే నిరాహార దీక్ష చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని, పనిచేయకపోతే మీకు ఇబ్బందులు తప్పవని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలో జరుగుతున్న టీడీపీ ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘నేనే మీదగ్గరకు వచ్చి నిరాహార దీక్ష చేస్తా.. అప్పుడైనా మీపైన ఒత్తిడి పెరుగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో గాంధీజీ ఇదే పద్ధతి అనుసరించారని గుర్తుచేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించాక పనిచేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. ‘అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. మట్టిరోడ్లు కనిపించడం లేదు. ఒక సమస్యను పరిష్కరిస్తుంటే మరో సమస్య ముందుకొస్తోంది. బురద అవుతుందని సిమెంట్ రోడ్డు వేస్తే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది’ అంటూ ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ‘మా ఊరు వెళితే అన్నీ సిమెంట్ రోడ్లుగా మారాయి. ఎక్కడా ఒక్క మట్టిరోడ్డు కూడా కనిపించలేదు’ అని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది జూదాల నియంత్రణపై దృష్టి పెట్టాలని, కోస్తా జిల్లాల్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అదుపు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కోడిపందాలను నేతలే ప్రోత్సహించడం సరికాదన్నారు. సంప్రదాయాలు కాపాడుకునే క్రమంలో జూదాలు ఎక్కువైతే సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూదాలను నియంత్రించడంపైనే ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించారు. హైదరాబాద్‌కు డబ్బులు వచ్చాయి.. ఆతర్వాత పబ్బులు వచ్చాయి.. పబ్బుల్లోకి డ్రగ్స్ వచ్చాయంటూ చంద్రబాబు చమత్కరించారు.
‘నవయుగ’కు పోలవరం పనులు
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చిందని, ఆ సంస్థకే కాంట్రాక్టు ఇచ్చేందుకు ఆమోదిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పాత రేట్లకే పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చిందన్నారు. నవయుగ ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయని సీఎం తెలిపారు. రెండు రోజుల్లో ఎస్క్రో అకౌంట్ తెరుస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం విషయంలో పారదర్శకతతో ఉన్నామని, విమర్శలకు అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని చంద్రబాబు సూచించారు. నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం వారిని ఆదరిస్తారన్నారు. రాష్ట్రంలో టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పోలవరంతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందన్నారు. కాంట్రాక్టర్లు ఎవరన్నది అనవసరమని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడమే తమ సంకల్పమన్నారు. ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు పనితీరుపై ఆధారపడి ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌కు మనం చేసిందేమీ లేదని కొందరు అంటున్నారని, 1995కు ముందు, ఆ తర్వాతి హైదరాబాద్ ఎలా వుందో చూస్తే వాస్తవం అర్థవౌతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.