ఆంధ్రప్రదేశ్‌

సీబీఐ అదుపులో ఎమ్మెల్సీ వాకాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 21: నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బ్యాంకులకు రుణాలు ఎగవేత కేసులో వాకాటిపై కర్నాటకలో పోలీసు కేసు నమోదై ఉంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది నెల్లూరు నగరంలోని వాకాటి నారాయణరెడ్డి ఇంటిలో సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఆదివారం ఉదయం బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో వాకాటి విచారణకు హాజరయ్యారు. రాత్రి పొద్దుపోయేవరకు సీబీఐ బృందం విచారించింది. ఆయనను అరెస్టు చేశారనే పుకార్లు వ్యాపించినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం అర్ధరాత్రి వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.