ఆంధ్రప్రదేశ్‌

పది లక్షల అప్పుకే ఆత్మహత్య చేసుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 22: పది లక్షల రూపాయల అప్పుకోసం ఆత్మహత్యలు చేసుకుంటారా.. మీ కుటుంబాలు నష్టపోవట్లేదా.. పారిశ్రామిక వేత్తలు లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు... పంటలు నష్టపోయినా.. ధరలు పతనమైనా ప్రభుత్వం ఆదుకుంటోంది కదా.. చిన్న అప్పులకు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం.. రైతులు ఆత్మస్థయిర్యాన్ని వీడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కిసాన్‌మేళా సందర్భంగా ఇటీవల గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించారు. సిరిపూర్ కాగజ్‌నగర్ పేపరు మిల్లు రైతులకు 14 వందల కోట్లు ఇవ్వాలి..మిల్లు మూసేశారు.. అందులో కొంతమేర ప్రభుత్వం చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.. మార్క్‌ఫెడ్ ద్వారా పదివేల మెట్రిక్ టన్నుల మినుములు కొనుగోలు చేయాలని నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది.. ఎరువులు పంపిణీ చేస్తోంది.. అయినా రైతులు నకిలీ విత్తనాలు, పురుగు మందులు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. దీనివల్లే నష్టాలు సంభవిస్తున్నాయి.. ఈ కారణంగా ఆత్మహత్యలు చేసుకోవటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అందించే విత్తనాలు, ఎరువులలో నాణ్యతా ప్రమాణాలకు అధికారులు బాధ్యత వహిస్తారు.. ప్రైవేటు వ్యాపారులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు రాయితీ కింద రూ. 110 కోట్లు చెల్లించామన్నారు. భూసార పరీక్షల ఫలితాలు 54 లక్షల మందికి అందించాం.. నేల స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఏ పంటలు వేయాలో అధికారులు వివరిస్తున్నారు.. వీటిపై అవగాహన పెంచుకుంటే ఆత్మహత్యలు నిలువరించ వచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంకితభావంతో రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర పేరిట రైతులను రెచ్చకొడుతూ వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. ఆయన మాటలను ప్రజలు, రైతులు విశ్వసించరన్నారు. నకిలీ బయో ఉత్పత్తుల వ్యాపారులపై పీడీ యాక్టు నమోదుచేసి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నామని, నష్టపోతే విత్తన కంపెనీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.