ఆంధ్రప్రదేశ్‌

కడప కలెక్టరేట్‌లో తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 23: కుటుంబ కలహాలు తండ్రీకొడుకుల ప్రాణాల మీదకు తెచ్చింది. భార్య కాపురానికి రావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ గంగరాజు, తండ్రి కోసం కొడుకు రాకేష్ వాస్మోయిల్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండగా, కుమారుడు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. కడప కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పులివెందుల మండలం మోట్‌నూత్నపల్లెకు చెందిన గంగరాజు(45), అతని కుమారుడు రాకేష్(12) మంగళవారం కడప కలెక్టరేట్‌లో వాస్మోయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాకు న్యాయం చేయండి అంటూ గంగరాజు కేకలు వేస్తూ వాస్మోయిల్ తాగాడు. ఇది గమనించిన రాకేష్ తానూ వాస్మోయిల్ తాగాడు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఉద్యోగులు, కలెక్టర్ సెక్యూరిటీ, చుట్టుపక్కలవారు వారించే లోపే గంగరాజు ఎక్కువ మోతాదులో తాగాడు. వెంటనే 108 వాహనానికి ఫోన్‌చేసి వీరిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. గంగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గంగరాజు ఆయన భార్య అంజలికి మధ్య ఏడాదికాలంగా మనస్పర్థలు ఉన్నాయి. చిన్న గొడవతో భార్య ఇంటిని వదిలి పెద్ద కుమార్తె, చిన్నకొడుకును తీసుకుని ప్రొద్దుటూరులో నివాసం ఉంటోంది. భార్య, పిల్లలను తనవద్దకు తెచ్చుకునేందుకు గంగరాజు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా భార్య రావడానికి అంగీకరించలేదు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. గంగరాజు తన పెద్దకొడుకుతో కలిసి గ్రామంలో ఉంటూ హోటల్ పనిచేస్తున్నాడు. భార్య, కూతురు, కుమారుడు వేర్వేరుగా ఉండటంతో జీర్ణించుకోలేక పోయిన గంగరాజు తనకు ఎవ్వరూ న్యాయం చేయలేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.