ఆంధ్రప్రదేశ్‌

గిట్టుబాటు ధర రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: చేతికొచ్చిన పంటకు తగు విధంగా గిట్టుబాటు ధర వచ్చి రైతే పూర్తి ప్రయోజనం పొందేలా గట్టి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. దావోస్ నుంచి అధికారులతో మంగళవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దావోస్‌లో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రైతుల విషయంలో ప్రత్యేకంగా అధికారులతో సమాలోచనలు చేస్తూ ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. చేతికొచ్చిన వరి పంటకు తగు విధంగా రైతులు ప్రయోజనం పొందేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టిసీమ వల్ల రైతులు ముఖ్యంగా కృష్ణాజిల్లా ప్రజలకు పుష్కలంగా పంట చేతికొచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. తద్వారా రైతులకు చేకూరిన అదనపు ప్రయోజనానికి తగు ప్రతిఫలం దక్కాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాలశాఖ అధికారులు రంగంలోకి దిగి, రైతులకు అండగా నిలవాలని ఆదేశించారు. రైతులకు ఏ మాత్రం నష్టం కలిగినా సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా కృష్ణాజిల్లా కలెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి గిట్టుబాటు ధరపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రైతుల మేలు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.