ఆంధ్రప్రదేశ్‌

జీవిత ఖైదీల విడుదలపై ప్రభుత్వం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని విడుదల చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ఖైదీల బంధువుల నుంచి జీవిత ఖైదీల విడుదలపై ప్రభుత్వానికి వినతులు అందాయి. 5 లేదా 7 సంవత్సరాలుగా జీవిత ఖైదు అనుభవిస్తూ, 65 సంవత్సరాలు దాటిన, వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఖైదీల విడుదల కోరుతూ అనేక వినతులు అందాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, నిబంధనల మేరకు అర్హులైన వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని నియమించింది. కమిటీలో న్యాయ విభాగం సెక్రటరీ, డీజీపీ, సిఐడి చీఫ్ లీగల్ అడ్వైయిజర్, అదనపు డీజీపీ (ఇంటెలిజెన్సు), డీజీ (జైళ్లు) సభ్యులుగా ఉంటారు. అర్హుల జాబితాలను ఈ కమిటీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది.